స్టార్ హీరో సినిమా అయినా సరే, అందులో ఏదో ఓ స్పెషల్ ఎట్రాక్షన్ ఉండాల్సిందే. ప్రేక్షకుల్ని మళ్లీ మళ్లీ థియేటర్లకు రప్పించుకోవడానికి అదో మార్గం. అలాంటి మార్గాల కోసమే దర్శకులు అన్వేషిస్తుంటారు. అతిథి పాత్రల కోసం స్టార్ హీరోల్ని రప్పించడం, ఐటెమ్ సాంగుల కోసం కథానాయికల్ని రంగంలోకి దింపడం అందులో భాగమే.
ప్రస్తుతం బాలకృష్ణ సినిమా కోసం బోయపాటి కూడా ఇలాంటి స్పెషల్ ఎట్రాక్షన్స్‌పై దృష్టి పెట్టబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. బాలయ్య - బోయపాటి కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. `మోనార్క్` అనే పేరు పరిశీలనలో ఉంది. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడని టాక్. విశ్రాంతి ఘట్టం ముందు.. కల్యాణ్ రామ్ ఎంట్రీ ఉండబోతోందని, ఓ యాక్షన్ సీన్ లీడ్ లో తాను కనిపిస్తాడని చెబుతున్నారు. అదే నిజమైతే.. బాలయ్య - కల్యాణ్ రామ్ లను ఒకే తెరపై చూడొచ్చు. ఇదివరకు `ఎన్టీఆర్` బయోపిక్‌లోనూ వీరిద్దరూ తెరపై కనిపించిన సంగతి తెలిసిందే. అందులో హరికృష్ణ పాత్రలో కల్యాణ్ రామ్ నటించారు.