ఈ సంక్రాంతికి విడుదలై.. సూపర్ హిట్ గా నిలిచింది `క్రాక్`. దాదాపు 30 కోట్లు వసూలు చేసి.. ఇంకా దూసుకుపోతోంది. రవితేజకు సరైన సమయంలో లభించిన, సరైన విజయం ఇది. నిజానికి ఈ కథ.. కల్యాణ్ రామ్ చేయాల్సింది. అటూ ఇటూ చేతులు మారి.. చివరికి.. రవితేజ దగ్గరకే వచ్చింది. గోపీచంద్ మలినేని రవితేజని దృష్టిలో ఉంచుకునే ఈ కథ తయారు చేశాడు. అయితే.. ఈ కథ ముందు రవితేజకు అంతగా ఎక్కలేదు. ఏదో మిస్ అవుతుందన్న ఫీలింగ్ కలిగింది. దాంతో.. ఈ కథని కల్యాణ్ రామ్ కి వినిపించారు.
కల్యాణ్ రామ్ దగ్గరకు వెళ్లాక.. స్క్రిప్టులో మార్పులు జరిగాయి. ఇంకాస్త బాగా తయారైంది. చివరికి మళ్లీ రవితేజనే గోపీచంద్ మలినేనిని పిలిచి `ఈ కథ చేసేద్దాం` అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ముందు అనుకున్న హీరో రవితేజనే కాబట్టి... గోపీచంద్ మలినేని కూడా.. రవితేజతో సినిమా చేయడానికి ఉత్సాహం చూపించాడు. కల్యాణ్ రామ్ కూడా పెద్ద మనసు చేసుకుని.. ఓకే అనడంతో... ఈ సినిమా రవితేజతో ఫిక్సయ్యింది.
కల్యాణ్ రామ్ ఏదైనా మెలిక పెట్టి...`ఈ కథ నాతో చేస్తా అన్నారు కదా` అని అడిగితే... ఈ ప్రాజెక్టు ఈ రూపంలో ఉండేది కాదు. మొత్తానికి `క్రాక్` సినిమాపై రవితేజ పేరు రాసుంది. అందుకే... తాను చేయగలిగాడు.