ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో డిజాస్టర్ టాక్ మూటగట్టుకున్న సినిమా ఏదైనా ఉందీ అంటే.. అది అల్లుడు అదుర్స్ సినిమానే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. సంతోష్ శ్రీన్‌వాస్ దర్శకుడు. జనవరి 14న రెడ్ సినిమాకి పోటీగా విడుదలైంది. రొటీన్ కథ, పేలవమైన కథనాలతో.. ఈసినిమా ప్రేక్షకుల్ని విసుగెత్తించింది. కాకపోతే... సంక్రాంతి సీజన్ కాబట్టి.. తొలి మూడు రోజుల్లో మంచి వసూళ్లే వచ్చాయి. తొలి వారంలో దాదాపు 7.2 కోట్లు రాబట్టుకుంది. ఇంత ఫ్లాప్ టాక్ లోనూ.. ఈ మాత్రం వసూళ్లు వచ్చాయంటే.. అది సంక్రాంతి సీజన్ మహిమే. ఈ సినిమాని.. నిర్మాతే సొంతంగా విడుదల చేసుకున్నాడు. కాబట్టి.. బ్రేక్ ఈవెన్ ల మేటరేం లేదు. ఎంతొస్తే అంత వచ్చినట్టు.
అల్లుడు అదుర్స్ 8 రోజుల వసూళ్ల వివరాలివి.
నైజాం 2.12 cr
సీడెడ్ 1.37 cr
ఉత్తరాంధ్ర 1.44 cr
ఈస్ట్ 0.53 cr
వెస్ట్ 0.50 cr
కృష్ణా 0.29 cr
గుంటూరు 0.52 cr
నెల్లూరు 0.24 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 7.01 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.13 cr
ఓవర్సీస్ 0.05 cr
టోటల్ వరల్డ్ వైడ్ 7.19 cr
ఈ సినిమాకి దాదాపు 30 కోట్ల వరకూ ఖర్చయ్యింది. అందులో 20 కోట్లు శాటిలైట్, డిజిటల్ రూపంలోనే వచ్చాయని టాక్. అంటే.... మరో 3 కోట్లు వస్తే... ఈ అల్లుడు గట్టెక్కినట్టు.