ఎన్టీఅర్ బయోపిక్ గురించిన ప్రకటన వెలువడిందో లేదో అప్పుడే ఆ సినిమా తీయొద్దు అంటూ కామెంట్స్ మొదలయ్యాయి.
వివరాల్లోకి వెళితే, ఎన్టీఆర్ భార్య అయిన లక్ష్మి పార్వతి.. ఎన్టీఆర్ బయోపిక్ పై స్పందిస్తూ- ఆయన జీవితం పై సినిమా అంటే ఆయన చివరిదశ కూడా చూపెట్టాల్సిందే, అలాగే ఆయనని ఎవరు వెన్నుపోటు పొడిచింది, ఆయనని రాజకీయంగా దెబ్బతీసిన అంశాలని కూడా పొందుపరచాలని ఆమె డిమాండ్ చేసారు.
ఇక బాలకృష్ణ మెయిన్ లీడ్ గా చేయడాన్ని, ఆర్జీవీ దర్శకత్వం చేయడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ఆమె కుండబద్దలుకొట్టేశారు.
దీనితో ఎన్టీఆర్ బయోపిక్ పై వివాదాలు షురు అయినట్టే.