కొత్త దర్శకుల్ని ప్రోత్సహించడంలో కళ్యాణ్‌రామ్ రూటే సెపరేటు. హీరోగా, నిర్మాతగా కొత్తవారితో పనిచేయడాన్ని ఇష్టపడతాడాయన. అలా కొత్త దర్శకుల్ని నమ్మి, చేదు ఫలితాల్ని చవిచూసినాసరే, కొత్త తరహా కథలు రావాలంటే కొత్త దర్శకులతోనే పనిచేయాలంటాడు కళ్యాణ్‌రామ్. విలక్షణంగా కనిపించడానికే ఆయన ఎక్కువ ఇష్టపడతాడు కూడా. అందుకే గతేడాది 'ఇజం'తో న్యూలుక్‌లో కనిపించాడు. లుక్ వరకూ ఓకే అయినా, కానీ ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందించలేదు కళ్యాణ్‌రామ్‌కి. అందుకే ఈ సారి ఓ కొత్త కథను ఎంచుకోవాలనుకుంటున్నాడట. ఈ కోవలోనే 'ప్రేమ ఇష్క్ కాదల్', 'సావిత్రి' చిత్రాల దర్శకుడు పవన్ సాధినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడట. ఇదో ప్రయోగాత్మక చిత్రమని సమాచారమ్. తన సొంత బ్యానర్ ఎన్టీయార్ ఆర్ట్స్ పతాకంపైనే ఈ సినిమా రూపొందించనున్నాడట. ఆల్రెడీ ఈ బ్యానర్‌లో తన సోదరుడు ఎన్టీయార్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు కళ్యాణ్‌రామ్. అది కాక తానే హీరోగా మరో సినిమాకి శ్రీకారం చుట్టాడు. ఈ సినిమాతో కళ్యాణ్‌రామ్ ఓ డిఫరెంట్ స్టోరీని అభిమానులకు పరిచయం చేయాలనుకుంటున్నాడట. అదేంటో ప్రస్తుతానికి అయితే సస్పెన్సేనట. కానీ అధికారికంగా త్వరలోనే ఆ వివరాలు వెల్లడి చేస్తానంటున్నాడు కళ్యాణ్‌రామ్.