ఎన్టీఆర్‌ని ఫాలో అవుతున్న కళ్యాణ్‌రామ్‌.!

By iQlikMovies - April 18, 2018 - 17:33 PM IST

మరిన్ని వార్తలు

ఏ విషయంలో అనుకుంటున్నారా? వివరాల్లోకి వెళితే, ఎన్టీఆర్‌తో 'టెంపర్‌' సినిమాలో నటించింది ముద్దుగుమ్మ కాజల్‌ అగర్వాల్‌. అంతకు ముందు 'బృందావనం' సినిమాలోనూ కాజల్‌ ఎన్టీఆర్‌తో కలిసి నటించింది. అయితే ఇటీవల కాజల్‌ నటించిన చిత్రం 'ఎమ్యెల్యే'. కళ్యాణ్‌రామ్‌ హీరోగా తెరకెక్కింది ఈ చిత్రం. నిజానికి కాజల్‌, కళ్యాణ్‌రామ్‌ గతంలో 'లక్ష్మీ కళ్యాణం' సినిమాలో కలిసి నటించారు. 

అయితే పదేళ్ల క్రితం మాట అది. ఆ సినిమా కాజల్‌కి తొలి సినిమా కూడా. ఇన్నాళ్ల గ్యాప్‌ తర్వాత మళ్లీ కాజల్‌ని హీరోయిన్‌గా పెట్టుకుని 'ఎమ్మెల్యే' సినిమా చేశాడు కళ్యాణ్‌రామ్‌. ఇదిలా ఉంటే, 'ఊసరవెల్లి'లో ఎన్టీఆర్‌కి జోడీగా నటించిన తమన్నా, కళ్యాణ్‌రామ్‌తో తొలిసారిగా జత కట్టింది. కళ్యాణ్‌రామ్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'నా నువ్వే'లో తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వరుస ఇలా ఉంటే, ఇప్పుడు తాజాగా కళ్యాణ్‌రామ్‌ నటించనున్న మరో సినిమాకి హీరోయిన్‌ కన్‌ఫామ్‌ అయినట్లు తెలుస్తోంది. 

ఆమె ఎవరో కాదు, ఇటీవల ఎన్టీఆర్‌తో జత కట్టిన ముద్దుగుమ్మే. ఎన్టీఆర్‌కి జోడీగా 'జై లవకుశ'లో నటించిన నివేదా థామస్‌ని కళ్యాణ్‌రామ్‌ తన సినిమాలో హీరోయిన్‌గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే, కళ్యాణ్‌రామ్‌, తన తమ్ముడు ఎన్టీఆర్‌ని అలా ఫాలో అయ్యి వస్తున్నట్లే అనిపిస్తోంది. 

ఈ వరుసలో నెక్స్ట్‌ ఉన్న ముద్దుగుమ్మ పూజాహెగ్దేనా? ఏమో అయినా కావచ్చు. ప్రస్తుతం పూజా హెగ్దే, ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS