పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు ఉదయం అనూహ్యంగా తనకి అంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్చిన సెక్యూరిటీ సిబ్బందిని వెనక్కి పంపించేశాడు.
ఆ వివరాల్లోకి వెళితే.. కొంతకాలం క్రితం, తనకి బయటకి వెళ్ళినప్పుడు తన సెక్యూరిటీ కోసం నలుగురు గన్ మెన్స్ ని ప్రభుత్వం నియమించింది. అయితే ఏమైందో తెలియదు కాని పవన్ కళ్యాణ్ వారిని పంపించివేసాడు. దీనికి గల కారణాలు అయితే తేలియరాలేదు.
ఇంకొంతమంది మాత్రం పవన్ కళ్యాణ్ పార్టీ అంతర్గత విషయాలని వీరి ద్వారా బయటకి వెళుతున్నాయి అని అందుకోసమే పవన్ కళ్యాణ్ వీరిని ప్రభుత్వానికి సరెండర్ చేశారు అని ఒక రూమర్ చక్కర్లు కొడుతున్నది.
మొత్తానికి పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదిగే క్రమంలో ఫక్తు రాజకీయ నాయకుడుగా మెల్లమెల్లగా మారిపోతున్నాడు అని చెప్పొచ్చు.