'హలో' అంటూ ప్రేక్షకుల్ని పలకరించిన ముద్దుగుమ్మ కళ్యాణీ ప్రియదర్శిన్. తొలి సినిమాతోనే నటిగా మంచి పేరు దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. తర్వాత 'చిత్రలహరి' సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న సాయి ధరమ్ తేజ్‌కి ఈ సినిమాతో హిట్ ఇచ్చి, లక్కీగాళ్ అయిపోయింది కూడా. ప్రస్తుతం శర్వానంద్‌తో 'రణరంగం' సినిమాలో నటిస్తోంది. అయితే, కళ్యాణి ఇంతవరకూ నటించిన సినిమాల్లో పెద్దగా గ్లామర్‌కి అవకాశం ఇవ్వలేదు.
దాంతో ఈ పాప హోమ్లీ హీరోయినే అన్నమాట అని ఓ ఐడియాకొచ్చేశారు. కానీ, తనలోనూ గ్లామర్ యాంగిల్ ఉందంటూ, ఓ స్పెషల్ పిక్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఆడియన్స్‌కి స్వీట్ షాకిచ్చింది కళ్యాణి. స్కిన్ కలర్ ట్రాన్స్‌పరెంటెడ్ శారీ ధరించి, కెమెరాకి ఓ హాట్ పోజిచ్చింది. ఫస్ట్‌టైం కదా. పారదర్శకంగానే అందాలారేసింది. అయినా, చూపించాల్సినంతా చూపించేసిందిలెండి. దాంతో పక్కా ఐడియాకొచ్చేశారు, కళ్యాణిలో ఫుల్ గ్లామర్ యాంగిల్ ఉందని. ప్రస్తుతానికి జస్ట్ బ్రేక్ ఫాస్ట్ మాత్రమే ఇచ్చిన కళ్యాణి, త్వరలో ఫుల్ మీల్స్ సిద్ధం చేస్తుందేమో చూడాలిక.