నాన్నగారిలా నేను: కళ్యాణ్‌రామ్‌ భావోద్వేగం

మరిన్ని వార్తలు

స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న 'ఎన్‌టిఆర్‌ బయోపిక్‌'లో నందమూరి కళ్యాణ్‌రామ్‌ నటిస్తున్నాడు. చైతన్యరధం ముందర, బాబాయ్‌ బాలకృష్ణతో కలిసి వున్న ఓ ఫొటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు కళ్యాణ్‌రామ్‌. 

చైతన్య రధ సారధి అంటే హరికృష్ణ అని అందరికీ తెలుసు. ఇటీవల హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ హరికృష్ణ పాత్రలో కళ్యాణ్‌రామ్‌ నటించాల్సి రావడం భావోద్వేగంతో కూడుకున్న అంశమే. అదే హరికృష్ణ జీవించి వుంటే, కళ్యాణ్‌రామ్‌.. ఎంతో ఉత్సాహంగా ఆ పాత్రలో నటించడానికి సిద్ధపడేవాడే. అలా నటించినందుకు కళ్యాణ్‌రామ్‌ ఆనందం.. ఓ రేంజ్‌లో వుండేది. ఇప్పుడూ ఆ ఆనందం వుంది.. కానీ, అదిప్పుడు భావోద్వేగంతో కూడుకున్నది. కొంత ఆవేదనతో కూడుకున్న సందర్భమిది. 

బాలకృష్ణ - ఆయన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్‌ పాత్రలో నటిస్తున్నారు. కళ్యాణ్‌రామ్‌ - ఆయన తండ్రి స్వర్గీయ హరికృష్ణ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సంగతి తెల్సిందే. అందులో ఒకటి 'ఎన్‌టిఆర్‌ కథానాయకుడు' కాగా, ఇంకొకటి 'ఎన్‌టిఆర్‌ మహా నాయకుడు'. ఈ సినిమా షూటింగ్‌ హైద్రాబాద్‌లో జరుగుతోంది. తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నట్లు ఎన్టీఆర్‌ చేసిన ప్రకటన తాలూకు సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందిప్పుడు. 

దర్శకుడు క్రిష్‌ ఈ సన్నివేశాల్ని ఎంతో అద్భుతంగా రూపొందిస్తున్నాడట. ఈ సినిమాలో శ్రీదేవి పాత్రలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, చంద్రబాబు పాత్రలో దగ్గుబాటి రానా నటిస్తున్న సంగతి తెల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS