బింబిసార టీజర్ రివ్యూ : త్రిగర్తల సామ్రాజ్యపు నెత్తుటి సంతకం

మరిన్ని వార్తలు

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ చిత్రం బింబిసార. వశిష్ఠ్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమా ద్వార పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా టీజర్ బయటికి వచ్చింది. బాహుబలిని గుర్తుకు చేస్తూ ఈ టీజర్ ని కట్ చేశారు. '' ఓ సమూహం తాలూకు ధైర్యాన్ని ఆ ఖడ్గం శాసిస్తే.. కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తలవంచి బానిసలైతే.. ఇందరి భయాన్ని చూస్తూ ఓ రాజ్యం పొగరుతో మీసం మేలిసింది.. అదే త్రిగర్తల సామ్రాజ్యపు నెత్తుటి సంతకం.. బింబిసారుడి ఏక ఛత్రాదిపత్యం'' ఈ వాయిస్ ఓవర్ తో హిస్టారికల్ విజువల్స్ ని చూపిస్తూ బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ రివిల్ అయ్యారు. విజువల్స్ అన్నీ గ్రాండ్ గా వున్నాయి,

 

అయితే టీజర్ చివర్లో ఓ షాక్ వుంది. బింబిసార అంటే మొత్తం హిస్టారికల్ మూవీ అని అంతా భావించారు. కానీ టీజర్ చివర్లో కళ్యాణ్ రామ్ మోడరన్ షూట్ వేసుకొని ఫైట్ చేయడం కొసమెరుపు. ఈ ఒక్క షాట్ తో బింబిసార సోషల్, హిస్టారికల్ సినిమా అని రివిల్ చేశారు మూవీ మేకర్స్. బహుసా సినిమాలో ఒక ఎపిసోడ్ లో బింబిసారుడి కధ రావచ్చుని ఈ టీజర్ చూస్తే అర్ధం అవుతుంది. మొత్తానికి టీజర్ ఇంట్రస్టింగ్ గా వుంది. కళ్యాణ్ రామ్ స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS