కమల్ హాసన్ తొలిప్రేమ ముచ్చట్లు

మరిన్ని వార్తలు

విశ్వ నటుడు కమలహాసన్ సినిమా పరంగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించాడో, వ్యక్తి గత  జీవితంలో అన్ని వివాదాలు మూటగట్టుకున్నాడు. ఇప్పుడు సినిమా, రాజకీయం అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు. కమల్ హాసన్ అందరికీ తెలిసి రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. గౌతమితో కొన్నాళ్ళు రిలేషన్ షిప్ లో  ఉన్నారు. కానీ ఆ బంధం కూడా ముడిపడలేదు.దాంతో ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నారు. కానీ కమల్ హాసన్ కి కూడా ఒక  మొదటి లవ్ స్టోరీ ఉంది. రీసెంట్ గా  తన తోలి ప్రేమను బయట పెట్టారు.


19 ఏళ్ల వయసులో కమలహాసన్ మొదటి సారి నటి శ్రీవిద్యను కలిసారట. అప్పటికే ఆమె స్టార్ హీరోయిన్. కమలహాసన్ మాత్రం అప్పుడప్పుడే ఇండస్ట్రీలో నటుడిగా ఎదుగుతున్నారు. అలాంటి టైమ్ లో వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. మొదటి సినిమాతోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమ ఆమె చనిపోయేంతవరకు కూడా కొనసాగిందంటూ ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమలహాసన్ ఎమోషనల్ గా చెప్పటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 'నేను ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా, నా మొదటి ప్రేమ అంతం కాలేదు,  సాధారణంగా కొన్ని ప్రేమకథలు పెళ్లితో అంతం కావు, ఎవరు ఎవరిని పెళ్లి చేసుకున్నా తమ మనసులో ఒకరికి స్థానం అనేది ఎప్పుడు ఉంటుందని. ఆ ఒక్కరు శ్రీవిద్య మాత్రమే అని కమలహాసన్ తెలిపారు.


శ్రీవిద్య వేరే వ్యక్తిని వివాహం చేసుకొని,  వైవాహిక జీవితంలో  కష్టాలను అనుభవించింది. ఆస్తి కోసమే తనను ఆ వ్యక్తి వివాహం చేసుకున్నాడని, అతని నిజ స్వరూపం తెలుసుకున్న ఈమె పెళ్లైన కొద్ది రోజులకే విడాకులు తీసుకొని ఒంటరిగా జీవితాన్ని కొనసాగించింది. జీవితంలో అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంది. చివరికి క్యాన్సర్ తో పోరాడి తుది శ్వాస విడిచింది. శ్రీవిద్య మృత్యువు తో పోరాడుతున్న సమయంలో కమలహాసన్ తో చివరి క్షణాలలో గడపాలని తనతో చివరి శ్వాస వరకు ఉండాలని కోరుకుందని, ఆమె కోరికను కమల్ కూడా మన్నించారని, ఆమె చనిపోయేంత వరకు ఆమెతోనే గడిపినట్లు చెప్పారు. తనపై నా ప్రేమ ఎప్పటికీ ఉంటుందని శ్రీవిద్యను ప్రేమించినంతగా మరెవరిని ప్రేమించలేదని కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకోలేదు. ఇప్పటికీ తన మనసులో శ్రీవిద్య కు స్థానం ఉంటుందని కమల్ హాసన్ చెబుతున్నారు. కమల్ హాసన్ లైఫ్ లో ఇంత మంది మహిళలు ఉన్నా ఎప్పటికీ నిలిచిపోయిన స్థానం శ్రీవిద్య ది మాత్రమే అని చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS