భారతీయుడు 2 మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

చిత్రం: భారతీయుడు 2
దర్శకత్వం: S .శంకర్ 
కథ : S  శంకర్ 


నటీనటులు: కమల్ హాసన్ ,  సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ , SJ సూర్య, ప్రియా భవానీ శంకర్ 
                      

స్క్రీన్ ప్లే: బి. జయ మోహన్ , కాబిలం వైరముత్తు , లక్ష్మి శరవణ కుమార్  

నిర్మాతలు: సుభాస్కరన్ అల్లి రాజా , ఉదయనిధి స్టాలిన్.  


సంగీతం: అనిరుధ్ రవి చందర్  
ఛాయాగ్రహణం: రవి వర్మ 
కూర్పు: శ్రీకర్ ప్రసాద్  


బ్యానర్స్: లైకా ప్రొడక్షన్స్ , రెడ్ జెయింట్ 
విడుదల తేదీ: 12 జూలై 2024

 

ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.25/5 

 

1996లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకి సీక్వెల్ గా దాదాపు 28 ఏళ్ళ తరవాత భారతీయుడు 2 వచ్చింది. చాలా ఏళ్లగా సరైన హిట్ లేని కమల్ కి విక్రమ్ లాంటి హిట్ ఇస్తుందని ఆశపడ్డారు టీమ్ అండ్ ఫాన్స్. అవినీతిని ఎండ గట్టడంలో శంకర్ కి తిరుగులేదు. శంకర్ చేసిన సినిమాలు ఎక్కువ శాతం అక్రమాలను, అన్యాయాల్ని, లంచగొండి తనాన్ని ఎదిరించే కథలే. జెంటిల్మెన్, భారతీయుడు, శివాజీ , మల్లన్న,ఇలా ప్రతి సినిమా ఇదే కాన్సెప్ట్ తో తెరకెక్కి విజయం సాధించాయి. ఇంకా సమాజం లో అవినీతి , లంచగొండి తనం రాజ్యం ఏలుతున్నాయని మళ్ళీ సేనాపతిని రంగంలోకి దింపాడు. మొదటి పార్ట్ లో సేనాపతి లంచం తీసుకుంటున్నాడని సొంత కొడుకుని చంపేసి విదేశాలకు వెళ్లిపోతాడు. మళ్లీ దేశంలో అరాచకం, లంచగొండితనం మొదలయిన సందర్భగా అరికట్టడానికి మళ్లీ సేనాపతి విదేశాల నుంచి మన దేశానికి వస్తాడు. ఈ క్రమంలో అవినీతి పరులను ఎలా అంత మొందించాడు? భారతీయుడు 2 ఎలా ఉంది? సేనాపతి మళ్లీ వచ్చి ఏం చేశాడు? లంచగొండితనం, అవినీతి మీద సేనాపతి పోరాటం ఎలా సాగింది అన్నది ఈ రివ్యూలో చూద్దాం.  


కథ:

సమాజంలో జరిగే అన్యాయాలు, అవినీతి, లంచ గొండి వ్యవహారాలను వీడియోలుగా తీసి అధికారులను, వ్యాపారులను పట్టించేందుకు పూనుకుంటాడు సిద్దార్థ్, ప్రియా భవానీ శంకర్, టీమ్. ఎక్కడ, ఎవరికి అన్యాయం జరిగినా ఆ విషయాన్ని ప్రపంచం మొత్తం తెలిసేలా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యం లో ఈ టీమ్ కష్టాల్లో పడుతుంది. పోలీసులు, ఇతర అధికారులు వీరిపై కక్ష కడతారు. సరిగ్గా ఇలాంటి టైం లో భారతీయుడు వస్తే బాగుండని కోరుకొంటాడు సిద్దార్థ్. భారతీయుడు మళ్లీ రావాలి అంటూ హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో  ట్రెండ్ చేస్తాడు. ఈ క్రమంలోనే తైపేలో ఉన్న 'భారతీయుడు' ఇండియాకు వస్తాడు. అవినీతి పరుల్ని , లంచం తీసుకున్న వారికి బుద్ధి చెప్తుంటాడు. చేసేదేం లేక భారతీయుడిని అరెస్ట్ చేసేందుకు సీబీఐ అధికారులు సెర్చ్ చేస్తుంటారు. నేటి సమాజంలో పేరుకుపోయిన అవినీతి, లంచగొండితనంపై సేనాపతి మళ్లీ ఎలాంటి పోరాటం చేశాడు? నేటి యువతను ఈ పోరాటంలో ఎలా భాగస్వామిని చేశాడు? అసలు సేనాపతి రావడాన్ని నేటి సమాజం ఎలా చూసింది? సమాజంలోని పౌరుల బాధ్యతల్ని సేనాపతి ఎలా గుర్తు చేశాడు? చివరకు లంచగొండి సమస్యని, అవినీతి మయమైన అధికారులను సేనాపతి ఎలా అంతం చేశాడు?  సోషల్ మీడియా టీమ్‌కు రకుల్ ఫ్రెండ్ ఎందుకు సహాయం చేస్తుంది. సిద్దూ టీమ్‌కు రకుల్‌కు సంబంధం ఏమిటి? ఈ సోషల్ మీడియా ఇన్ల్పూయెన్సర్లను భారతీయుడు ఎలాంటి పరిస్థితుల్లో కలిశాడు? భారతీయుడిని అరెస్ట్ చేయడానికి వచ్చిన  సీబీఐ అధికారి బాబీ సింహా సక్సెస్ అయ్యాడా? చివరకు భారతీయుడు తీసుకొన్న నిర్ణయం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే భారతీయుడు 2 కథ.   


విశ్లేషణ:

భారతీయుడు సినిమా చూసిన వారు ఇప్పటికీ అదే ఫీలింగ్ లో ఉన్నారు, అప్పుడు ఆ కథ కొత్తది. కమల్ యాక్టింగ్ , ఫ్యామిలీ డ్రామా ఒక వైపు , ఇంకో వైపు లంచాలమయంగా ఉన్న సమాజాన్ని ఎలా క్లిన్ చేసాడు అన్న ఆ కథని బట్టీ ఈ మూవీ తీశారు. మళ్ళీ భారతీయుడు తీయటానికి కారణమేంటి ఇంకా లంచ గొండి , అవినీతి ప్రపంచం ఉందా అని శంకర్ ని   అడగ్గా , అందుకనే భారతీయుడు 2  అవసరం పడింది అని చెప్పారు. కానీ భారతీయుడి  అనుభూతిని, ఆ మ్యాజిక్‌ను పార్ట్ 2 ఇవ్వలేకపోయింది చెప్పొచ్చు. మొదటి పార్ట్ మీద ఉన్న అభిమానంతో ఆ స్థాయిలో ఆశించి వస్తే నిరాశ తప్పదు. మూవీ ఫస్ట్ హాఫ్ కొన్నిఎమోషనల్ సీన్స్ మిస్ అయినా సెకండాఫ్‌ లో కొంత వరకు కవర్ చేసాడు. ఫస్టాఫ్‌లో విజయ్ మాల్యా, గాలి జనార్థన్ రెడ్డి లాంటి కొందరి ప్రముఖుల జీవితాలను టచ్ చేసి సినిమాకు మంచి ఆరంభం ఇచ్చాడు.  భారతీయుడు 2 సినిమాలో శంకర్ స్థాయిలో గ్రాండియర్, విజువల్స్ అన్నీ ఉన్నాప్రధానమైన ఎమోషన్ మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. లంచగొండితనం, అవినీతి అనేవి సమాజంలో చాలా రొటీన్‌గా మారాయి. వాటిని విభిన్నంగా ప్రజంట్ చేయగలిగినప్పుడే ప్రేక్షకుల్లో ఆసక్తి కలుగుతుంది. ఈ విషయంలో శంకర్ ఈసారి ఫెయిల్ అయ్యాడు. సేనాపతి క్యారక్టర్ తో అంతా విసిగిపోయారు.  శంకర్ స్థాయి మార్క్ అందుకోలేక పోయాడు. అనిరుధ్ మ్యూజిక్ కూడా పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు.  


ఫస్ట్ హాఫ్ ఎదో అలా సాగదీసి, సెకండాఫ్‌లో ప్లాన్ ప్రకారం కొన్ని ట్విస్టులు జొప్పించారు. సిద్దార్థ్, రకుల్ పాత్రలకు సంబంధించిన ట్విస్టులు ఆలోచింపచేస్తాయి. క్లైమాక్స్‌ ఛేజింగ్ సీన్ నిడివి ఎక్కువయ్యింది. భారతీయుడు 3 గురించి ఇచ్చిన ట్విస్టు ఆసక్తిని రేపింది. పార్ట్ 3లో చరిత్ర మరిచిపోయిన వీరశంకరన్ అనే స్వాతంత్ర సమరయోధుడిని పరిచయం చేశాడు సేనాపతి. యుద్ధ సన్నివేశాలతో పార్ట్ 3పైన ఆసక్తి పెంచాడు. ఫైనల్ గా కమల్ ఫెర్ఫార్మెన్స్ కోసం, శంకర్ టెక్నికల్ బ్రిల్లియన్స్ కోసం థియేటర్‌లో ఓసారి చూడొచ్చు.


నటీనటులు:
 
కమల్ హాసన్ నటన గురించి కొత్తగా ఏం చెప్పడానికి లేదు . విశ్వ నటుడి నటనకి వంకలు పెట్టలేము. కానీ ఓవర్‌ మేకప్ కొంత కొంప ముంచింది. దీనివల్ల భారతీయుడి క్యారెక్టర్‌కు ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఛాన్స్‌ దెబ్బ తింది. కమల్ హసన్‌ ఒరిజినల్ గెటప్ ఒక్కసారి కూడా చూపించలేదు. ఎక్కువ సేపు మేకప్‌లో చూపించడం కమల్ ఫాన్స్ అసహనానికి లోనయ్యారు. ‘భారతీయుడు’ మూవీలో సేనాపతి గెటప్ వింతగా అనిపించదు. కానీ ‘భారతీయుడు 2’ మూవీకి వచ్చేసరికి కమల్ హాసన్ గెటప్స్ అన్నీ వింతగా అనిపిస్తాయి. సిద్దార్థ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహ పాత్రలు ఫర్వాలేదనిపించాయి. కానీ ఎమోషనల్‌గా ఆ క్యారెక్టర్ల ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. సినిమాలో కూడా ట్రావెల్ కాలేదు.  రకుల్ ప్రీత్ రోల్ అస్సలు ఆకట్టుకోలేదు. సిద్దార్థ్ ఎమోషనల్ సీన్లలో రాణించాడు. సముద్రఖని సెకండాఫ్‌లో తన మార్కు చూపించాడు.  


టెక్నికల్:

శంకర్ దర్శకత్వం జనాలకి చేరువ కాలేక పోయింది. శంకర్ మార్క్ సినిమాలా లేదు. టెక్నీకల్ అంశాలు పరవాలేదనిపించాయి. కట్టి పడేసే కథ , కథనం లేదు . ఎమోషన్స్ మిస్ చేసాడు దర్శకుడు. కొన్ని ట్విస్ట్ లు పరవాలేదనిపింఛాయి. విజవల్ గా మెప్పించారు. భారతీయుడులో సంగీతం కూడా ప్లస్ . ఏఆర్ . రెహమాన్ సంగీతం నేటికీ ట్రెండింగ్ లో ఉంది. పాటలు తమిళ డబ్బింగ్ సినిమా పాటలు లా ఉండవు మ్యూజికల్ హిట్ . కానీ భారతీయుడు 2 సంగీతం  మైనస్. అనిరుధ్ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. కనీసం ఒక్క పాట కూడా అలరించలేదు. ఇప్పటివరకు జనాల్లోకి పాటలు వెళ్లకపోవటానికి కూడా కారణం ఆకట్టుకునే సంగీతం , సాహిత్యం రెండు లేకపోవటం వలనే. ఎదో మొదలు పెట్టాం కాబట్టి పూర్తి చేయాలన్న ఉద్ద్దేశ్యంతో శనకర్ భారతీయుడు ముగించినట్లు అనిపిస్తుంది. రెగ్యులర్, రొటీన్ సినిమాలా ఉంది. పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. 

 

ప్లస్ పాయింట్స్ 

కమల్ నటన


మైనస్ పాయింట్స్ 

ఎమోషన్స్ మిస్సింగ్ 
కమల్ ఓవర్ మేకప్ 
స్క్రీన్ ప్లే  

 

ఫైనల్ వర్దిక్ట్ : పాత కథ - కొత్త తాలింపు

ALSO READ : REVIEW IN ENGLISH


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS