మోస్ట్ అవైటెడ్ పానిండియా మూవీస్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప: ది రూల్ ఒకటి. అసలు ఎప్పుడో రిలీజ్ కావల్సిన సినిమా అలా లేట్ అవుతూ వచ్చింది. పుష్ప: ది రైజ్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి. మొదటి పార్ట్ లో బన్నీ మ్యానరిజం, లుక్, అతడి పాత్ర తీరు తెన్నులు సినీప్రియుల్ని ఎంతగానో మెప్పించాయి. ఏకంగా నేషనల్ అవార్డ్ కూడా కొట్టేసాడు బన్నీ. సుకుమార్ ఒక్క సారిగా పానిండియా దర్శకుడి లిస్ట్ లో చేరిపోయాడు. నేషనల్ క్రష్ ఇంటనేషనల్ క్రష్ గా మారింది. వీటన్నిటి కారణంగా పుష్ప రూల్ కి మార్కెట్ కూడా పెరిగింది.
రిలీజ్ అయ్యాక ఎన్ని రికార్డ్ లు తిరగరాస్తుందో తెలియదు కానీ, ముందే కొత్త రికార్డ్స్ సృష్టిస్తోంది. నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే నయా రికార్డు క్రియేట్ చేసింది పుష్ప రూల్. ఓటీటీ, శాటిలైట్, ఆడియో హక్కుల కోసం భారీ డీల్ కుదిరినట్లు టాక్. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కెఇ జ్ఞానవేల్ 'పుష్ప 2' హిందీ వెర్షన్ నాన్ థియేట్రికల్ హక్కులే రూ. 260 కోట్లకి అమ్ముడుపోయినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఇదే హయ్యెస్ట్ నాన్-థియేట్రికల్ డీల్ అని సమాచారం. ఇంకే భాషలోనూ ఈ స్థాయిలో నాన్ థియేట్రికల్ బిజినెస్ జరగలేదని తెలుస్తోంది.
నార్త్ ఇండియన్ మార్కెట్ లో 'పుష్ప: ది రూల్' మూవీ రికార్డులు బ్రేక్ చేస్తుందని, బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాదిస్తుందని ట్రేడ్ పండితులు సూచిస్తున్నారు. ఆగస్ట్ 15న రిలీజ్ కావల్సిన ఈ మూవీ షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటం, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మిగిలుండటం వలన డిసెంబర్ 6 కి వాయిదా పడింది. వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 6 న పుష్ప రాజ్ సందడి మొదలవుతుంది.