ప్రపంచం మొత్తం కల్కి సినిమా మానియా నడుస్తోంది. ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నటించిన ఈసినిమాని నాగ అశ్విన్ తెరకెక్కించాడు. ఇందులో అమితాబ్, కమల్ , దిశాపటాని లాంటి మిగతా నటీ నటులు కూడా ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కల్కి సినిమాని సుమారు 600 కోట్ల బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరక్కెకించింది వైజయంతి మూవీస్. జూన్ 27 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. సౌత్ భాషలతో పాటు, హిందీ, ఇంగ్లీష్ , మిగతా భాషల్లో కూడా కల్కి రిలీజ్ కానుందని సమాచారం. బుధవారం రామోజీ ఫిలిం సిటీ లో ఒక ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించే పనిలో ఉన్నారు మేకర్స్.
ఈ క్రమంలో కల్కి లో నటించిన కమల్ హాసన్ పారితోషికం గూర్చి ఒక ఆసక్తి కరమైన విషయం వెలుగులోకి వచ్చింది. కల్కిలో విశ్వనటుడు కమల్ నటించటంతో సినీప్రియుల ఆసక్తి ఎక్కువ అయింది. ఈ మూవీలో కమల్ క్యారక్టర్ ఎలా ఉంటుందో, సినిమాపై ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో అని ఉహాగానాలు మొదలయ్యాయి. ఈ మూవీలో కమల్ హాసన్ క్యారక్టర్ కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంటుందని తెలుస్తోంది. అది కూడా మూవీ ఆఖరిలో కమల్ కనిపిస్తారట. అయినా గానీ ఆ పాత్ర మూవీకి హైలెట్ గా నిలుస్తుంది అని, సెకండ్ పార్ట్ లో కూడా కమల్ పాత్ర కొనసాగుతుందని సమాచారం.
అంటే ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ లో కమల్ పాత్ర నిడివి ఎక్కువ ఉంటుంది. మొదటి పార్ట్ లో కేవలం 20 నిమిషాలు కనిపిస్తారట. ప్రభాస్ తో అయితే రెండు మూడు సీన్స్ లోనే కనిపిస్తారని తెలుస్తోంది. కానీ ఈ 20 నిమిషాల పాత్రకి కమల్ 10 కోట్లు పారితోషికం తీసుకున్నారని సమాచారం. సెకండ్ పార్ట్ కి ఇంకా ఎక్కువ డిమాండ్ చేసే అవకాశం ఉంది. విశ్వనటుడి రేంజ్ కి ఆమాత్రం ఉండాలని అంటున్నారు ఫాన్స్.