విశ్వనటుడు కమల్ హాసన్ రూటే సెపరేట్. ఎవరికీ దేనికి తలవంచరు. తాను నమ్మిన సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఎవరేమన్నా పట్టించుకోరు. తన చుట్టూ ఎన్ని వివాదాలు సృష్టించినా వేటికి తొణకరు, బెణకరు. ఇలా అన్నిటా కమల్ రూటు వేరు. సినిమా కోసం ఎన్ని ప్రయోగాలు చేయటానికి అయినా ముందు ఉంటారు. ఎంత కష్టమైనా సినిమా ముందు అవన్నీ దిగ దుడుపే ఆయనకి. ఈ మధ్యే పుట్టినరోజు జరుపుకున్న కమల్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుని తన ఫాన్స్ కి అదే విషయాన్నిస్పష్టం చేసారు. అదేంటి అంటే తన పేరుకు ముందు 'ఉలగనాయగన్', 'విశ్వనటుడు' అంటూ ట్యాగ్స్ పెట్టి పిలవటాన్ని తిరస్కరించారు కమల్.
ప్రస్తుతం హీరోలంతా ట్యాగ్ ల మీది ట్యాగ్ లు జోడించుకుంటున్నారు. కొందరు తమకి తామే ట్యాగ్ లు ఇచ్చుకుంటున్నారు. అలాంటిది కమల్ ఇలాంటి నిర్ణయం తీసుకోవటం శోచనీయం. హీరోల్లో కమల్ కి ఉన్న క్రేజ్ తో, ప్రేమతో ఫాన్స్ ఆయన్ని ఇలా ప్రత్యేకంగా పిలుచుకుంటారు. కానీ అవన్నీ వద్దు అంటున్నారు కమల్ హాసన్. ఇకపై తనని అలా పిలవద్దని కండీషన్ పెట్టాడు. ఈ విషయాన్ని తెలియయజేస్తూ ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టాడు కమల్ హాసన్. 'నా పనిని మెచ్చి 'ఉలగ నాయగన్' విశ్వనటుడు లాంటి ఎన్నో బిరుదులు ఇచ్చినందుకు ఎప్పుడూ కృతజ్ఞతో ఉంటా. ప్రేక్షకులు, తోటి నటీనటులు, ఆత్మీయుల నుంచి వచ్చే ఇలాంటి ప్రశంసలు ఇంకొంచెం ప్రోత్సహకంగా ఉంటాయి. ఆ పిలుపు నన్నెంతగానో కదిలిస్తుంది. ఏ వ్యక్తి ఊహకి అందనిది సినిమా. అందులో నేను నిత్య విద్యారిని. సినిమా రంగంలో ఎన్నో విషయాలు నేర్చుకోవాలని, మరింతగా ఎదగాలని ఆశిస్తున్నాను అన్నారు కమల్.
అన్ని కళల్లానే సినిమా కూడా అందరికీ సొంతం అని, కళ కంటే కళా కారుడు గొప్పవాడు కాదు అన్నది తన అభిప్రాయం అని కమల్ పేర్కొన్నారు. ఇంకా నటనలో తనలోపాలు సరిచేసుకోవాలను కుంటున్నట్లు, నటుడిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలనుకుంటున్నట్లు కమల్ ప్రస్తావిస్తూ, ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానని, స్టార్ ట్యాగ్ ని మర్యాద పూర్వకంగా తిరస్కరిస్తున్నా అని తెలిపారు కమల్. నా ఫాన్స్, సినీ ప్రముఖులు, భారతీయులంతా నన్ను కేవలం కమల్ హాసన్ లేదా కమల్ లేదా కెహెచ్ గా పిలవాలని అభ్యర్ధించారు.