మన దేశంలో ఎక్కడ ప్రకృతి వైపరీత్యం సంభవించినా వెంటనే స్పందించే వారిలో మన తెలుగు హీరోలు ముందు వరుసలో ఉంటారు.
ఇక ప్రస్తుతం కేరళ రాష్ట్రం వరదల బీభత్సంతో అతలాకుతలమవుతున్న నేపధ్యంలో అక్కడి సహాయ కార్యక్రమాలకి తమవంతు సహాయంగా హీరోలు కమల్ హాసన్ రూ 25లక్షలని విరాళంగా ప్రకటించగా అదే దారిలో అల్లు అర్జున్ కూడా రూ 25లక్షలు కేరళ సహాయానికి ఇస్తునట్టుగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
నిన్నటి రోజున విజయ్ దేవరకొండ కూడా రూ 5 లక్షలు సహాయ కార్యక్రమాలకు తనవంతుగా ఇస్తూ ఫ్యాన్స్ ని కూడా ఇంతటి మంచి పనిలో భాగంగా కేరళకి ఆర్ధికంగా సహాయం చేయాలని కోరాడు.
మొత్తానికి సాటి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఇలా బాధ్యత తీసుకుని ఆర్ధిక సహాయం చేయడం నిజంగా ఆదర్శనీయం అని చెప్పొచ్చు.