ప్రముఖ హీరో భరత్ కి కవల పిల్లలు

మరిన్ని వార్తలు

ప్రముఖ తమిళ హీరో భరత్ ఈమధ్యనే తండ్రిగా ప్రమోట్ అయ్యాడు, ఆయన భార్య ఒకే కాన్పులో ఇద్దరు మగపిల్లలకి జన్మనిచ్చారు. ఈ విషయాన్నీ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

హీరో భరత్ 2013లో జెశ్లీ అనే దంత వైద్యురాలిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఇక వారి అయిదేళ్ళ పెళ్ళికి బహుమతిగా వీరికి కవలలు పుట్టారు అని వారి సన్నిహితులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

ఇదిలావుండగా భరత్ తెలుగులో బాయ్స్, ప్రేమిస్తే చిత్రాలతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు, తాజాగా మహేష్ బాబు హీరోగా నటించిన స్పైడర్ లో ఒక ముఖ్యపాత్రలో మెరిశాడు. ఆ పాత్రకి మంచి మార్కులే వేయించుకున్నాడు భరత్.

ఈ సంతోష సందర్భంలో మా www.iQlikmovies.com తరపున భరత్ కుటుంబానికి శుభాకాంక్షలు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS