చాలా రోజుల నుండి కొనసాగుతున్న సస్పెన్స్ కి ఎట్టకేలకి తెరపడింది. లోకనాయకుడు కమల్ హసన్ తన రాజకీయ రంగప్రవేశం గురించిన కీలక ప్రకటన చేసేశాడు.
నిన్న చెన్నైలో ఆయన అభిమాన సంఘం 39వ వార్షికోత్సవానికి కమల్ హజరయ్యాడు. ఆ వేదిక పై నుండే తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ప్రకటించాడు, అయితే తన పార్టీని, జెండాని, అజెండాని ప్రకటించే ముందు చేయవలసింది చాలా ఉంది అని చెప్పాడు.
ఇదిలావుండగా రేపు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక యాప్ ని ఆయన ప్రారంబించనున్నట్టు ఆయన ప్రకటించాడు. ఇక ఇప్పుడు రాజకీయ పార్టీ నడపాలంటే కోట్లతో వ్యవహారం అని అందరు అంటున్నారు అలాగే తన వద్ద డబ్బు లేదని అందుకే తమిళ ప్రజలని విరాళాలు అడగటానికి సిద్ధం అని చెప్పాడు.
ఇక వెండితెర నుండి క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన హీరోల జాబితాలో కమల్ హసన్ పేరు కూడా చేరింది.