రాజకీయ నాయకులతో కమల్ హసన్ అమీతుమీ

మరిన్ని వార్తలు

తనకి నచ్చిన తోచిన అంశం పైన ఎటువంటి వ్యాఖ్య చేయడానికి అయినా వెనుకాడని కమల్ హాసన్ తాజాగా తమిళనాట ప్రబుత్వం పై నిప్పులు చెరిగాడు.

ప్రభుత్వంలోని మంత్రులంతా అవినీతిలో మునిగిపోయారు అని, అసలు పాలన మొత్తం అస్తవ్యస్తంగా తయారయింది అని స్టేట్మెంట్ ఇచ్చారు. దీనితో తమిళ నాట రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కొంతమంది మంత్రులైతే, కమల్ ని నోరు అదుపులో ఉంచుకోవాలని హెచ్చరించగా, మరికొంతమంది ఆయన పై పరువునష్టం దావా వేస్తామని ప్రకటిస్తున్నారు. 

తమని విమర్శించడానికి కమల్ కి అర్హత లేదని, బిగ్ బాస్ వంటి షోలు చేస్తూ తమిళ సంస్కృతిని చెడగోడుతున్నాడు అని విమర్శల పర్వం కొనసాగిస్తున్నారు.

దమ్ముంటే రాజకీయాల్లోకి వచ్చి తమని ఎదుర్కోవాలని సవాలు విసురుతున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS