లోకనాయకుడు కమల్ హాసన్ ప్రఖ్యాత నటుడే కాదు సమాజంలో జరుగుతున్న వాటిని విశ్లేషించగలిగిన సామర్ధ్యం ఉన్నవాడు.
ఇక విషయంలోకి వస్తే, మెరీనా బీచ్ లో నిరసన వ్యక్తం చేస్తున్న సామాన్య ప్రజలని చెదరగొట్టే వ్యూహంతో పోలీసులు ఈ రోజు వాళ్ళ లాఠీలకి పని చెప్పారు. దీని వల్ల శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమం కాస్త హింసాత్మకంగా మారింది.
వెంటనే కమల్ తన ట్విట్టర్ ద్వారా నిరసన కొనసాగిస్తున్న వారిని శాంతిపరిచే పనిలోపడ్డాడు. శాంతియుతంగా జరుగుతున్న కార్యక్రమం పై పోలీసులు తమ అత్యుత్సాహం చూపడం తప్పు అని చెప్పారు.
కమల్ ముందునుండి జల్లికట్టు పై విధించిన బ్యాన్ సరైంది కాదు అని వాధిస్తున్నాడు. అంతేకాక తమిళనాట జరుగుతున్న ఉధ్యమానికి తన మద్ధతు కూడా ప్రకటించాడు.