వివాదాలకు కేరాఫ్ అడ్రస్స్ కమల్ హాసన్. తన పేరు ఏదో ఓ రూపంలో వార్తల్లో వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా కమల్ పై ఓ రూమర్ తెగ చక్కర్లు కొడుతోంది. నటి పూజా కుమార్‌తో కమల్ సహజీవనం చేస్తున్నాడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కొన్ని తమిళ పత్రికలు వీరిద్దరి రహస్య జీవనం గురించి కొన్ని కథనాలు ప్రచురించాయి. కమల్‌తో విశ్వరూపం2, ఉత్తమ విలన్ చిత్రాల్లో నటిచంఇంది పూజా కుమార్. తెలుగులో రాజశేఖర్ గరుడవేగలోనూ నటించింది. విశ్వరూపం సమయంలోనే కమల్‌తో సాన్నిహిత్యం పెరిగిందని, అప్పటి నుంచీ కమల్ పూజాని వదల్లేకపోతున్నాడని వార్తల సారాంశం. వీటిపై పూజ వివరణ ఇచ్చింది.
కమల్ తనకు మంచి స్నేహితుడని, అతని కుటుంబంతో కూడా తనకు సన్నిహిత సంబంధాలున్నాయని, కమల్ ఇంట్లో ఏ శుభ కార్యం జరిగినా తాను తప్పకుండా హాజరవుతానని ఇవన్నీ చూసి తామిద్దరి మధ్య ఏదో ఉందని అపోహ పడుతున్నారని వాపోతోంది. కమల్ గొప్ప నటుడని, తన స్నేహం అమూల్యమైనదని, ఇలాంటి గాసిప్పులు తమ స్నేహం మధ్య చిచ్చు పెట్టలేవని చెప్పుకొచ్చింది.