‘ముందు ముందు సినిమాల్ని ది¸యేటర్లలో రిలీజ్ చేయడం కష్టమవుతుందేమో.. అప్పుడు డైరెక్ట్‌గా ఇంట్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేయాల్సి వుంటుంది..’ అని కొన్నేళ్ళ క్రితం విలక్షణ నటుడు కమల్ హాసన్ వ్యాఖ్యానించిన విషయం విదితమే. తన సినిమా ‘విశ్వరూపం’ విడుదలకు సమస్యలు ఎదురుకావడంపై ఆయనలా స్పందించాడు. అదిప్పుడు నిజమవుతోంది. కారణం కరోనా వైరస్ అయినా.. దియేటర్లలో సినిమా విడుదల చేయడానికి ఈ మధ్య ఇబ్బందులు బాగా పెరిగిపోయాయని కొందరు చిన్న నిర్మాతలే కాదు, కొందరు పెద్ద నిర్మాతలు కూడా వాపోతున్నారు.
సమయానికి దియేటర్లు దొరక్కపోవడం వంటి చాలా కారణాలు, సినిమాల రిలీజ్‌లకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. సరిగ్గా ఈ టైవ్‌ులోనే కరోనా మహమ్మారి దియేటర్లను నెల రోజులకు పైగానే మూత పడేలా చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడంతా ‘ఓటీటీ’ రిలీజ్ గురించిన చర్చల్లో తలమునకలై వున్నారు. కొందరు ససేమిరా అంటున్నారు.. ఇంకొందరైతే, ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదొక్కటే మార్గం..’ అంటున్నారు. ఒక్కటి మాత్రం నిజం.. లాక్‌డౌన్ ఎత్తివేశాక కూడా, ప్రేక్షకులు దియేటర్లకు వెళ్ళాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చు.
మరి, ఆ పరిస్థితి వస్తే, సినిమాలకు ఎంత ఇబ్బందికరంగా మారుతుంది.? ఇప్పుడొస్తున్న భారీ ఆఫర్స్ వదులుకుంటే, ముందు ముందు రెంటికీ చెడ్డ రేవడిలా తయారవుతుందనే ఆవేదన చాలామంది దర్శక నిర్మాతల్లో పెరుగుతోంది.