సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందిన 'రోబో 2.0' చిత్రం విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో శంకర్ కాస్త రిలీఫ్ అయ్యారు. నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టనున్నారు. గత కొంత కాలంగా 'రోబో 2.0' పనులతో బిజీగా ఉన్న శంకర్ తన తదుపరి ప్రాజెక్ట్ వివరాలను ముందుగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే విశ్వనటుడు కమల్‌హాసన్‌తో తెరకెక్కించబోయే 'భారతీయుడు' సీక్వెల్.
ఈ సినిమాకి సంబంధించి లొకేషన్స్ వేటలో ప్రస్తుతం శంకర్ బిజీగా ఉన్నారనీ తెలుస్తోంది. అందులో భాగంగానే థాయ్‌లాండ్‌లోని పలు లొకేషన్స్‌ని శంకర్ పరిశీలిస్తున్నారట. ఇటీవలే 'విశ్వరూపం 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కమల్‌హాసన్. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు కానీ, ఈ సినిమా కోసం కమల్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రమోషన్స్ నిర్వహించారు. హైద్రాబాద్‌లో ఘనంగా సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఇందులో భాగంగానే హైద్రాబాద్‌లో జరుగుతున్న బుల్లితెర రియాల్టీ షో 'బిగ్‌బాస్' సెట్‌లోనూ కమల్ హాసన్ సందడి చేశారు.
ఇక త్వరలోనే 'భారతీయుడు 2' ప్రాజెక్ట్‌ని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారట. ఈ సినిమా కోసం స్క్రిప్టు పనులు ఎప్పుడో పూర్తి చేసి పక్కన పెట్టేశారట శంకర్. ఇక లొకేషన్స్ వెతుకులాటే తరువాయి. దాదాపు ఆ పనులు కూడా ఓ కొలిక్కి వచ్చేశాయని సమాచారమ్. అనిరుధ్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించనున్నారు. రవివర్మన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు. హీరోయిన్ తదితర ఇతర టెక్నీషియన్స్ వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.