హైద్రాబాద్‌లో విశ్వనటుడి 'విశ్వరూపం'.!

మరిన్ని వార్తలు

విశ్వనటుడు కమల్‌హాసన్‌కి తమిళంతో పాటు, తెలుగు, హిందీ ఇతర భాషల్లోనూ అభిమానులున్నారు. అందుకే ఆయన విశ్వనటుడయ్యారు. అప్పుడెప్పుడో తెలుగులో విడుదలైన 'చీకటిరాజ్యం' సినిమా తర్వాత కమల్‌ హాసన్‌ నుండి వస్తున్న చిత్రం 'విశ్వరూపం 2'. ఆగష్టు 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ సందర్భంగా తెలుగులో ప్రమోషన్స్‌ కోసం కమల్‌హాసన్‌ సంసిద్ధమవుతున్నారట. ఆల్రెడీ తమిళం, హిందీ ప్రమోషన్స్‌లో జోరుగా పాల్గొన్న కమల్‌హాసన్‌ గురువారం నుండీ తెలుగులో ప్రమోషన్స్‌ నిర్వహించనున్నారట. తెలుగు రాష్ట్రాల్లో కమల్‌ హాసన్‌ 'విశ్వరూపం 2' ప్రమోషన్స్‌లో జోరుగా పాల్గొననున్నారట. ముఖ్యంగా గురువారం సాయంత్రం 4 గంటలకు 'విశ్వరూపం 2' చిత్ర ఆడియో విడుదల చేయడం ద్వారా ఈ చిత్రం ప్రమోషన్స్‌ మొదలు కానున్నాయి. 

ఈ ఆడియో వేడుక కోసం హైద్రాబాద్‌లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగు చిత్రసీమకు సంబంధించిన కమల్‌ సన్నిహితులు, సినీ ప్రముఖులు ఈ ఆడియో వేడుకకు హాజరయ్యే అవకాశాలున్నాయనీ తెలుస్తోంది. కమల్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'విశ్వరూపం' సినిమా పలు వివాదాల నడుమ విడుదలైనా, మంచి విజయం అందుకుంది. ఆ సినిమాకి ప్రీక్వెల్‌ మరియు సీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రమే 'విశ్వరూపం 2'. 

ఈ సినిమాకి ఆయనే దర్శకుడు, నిర్మాత కూడా. ఆండ్రియా, పూజా కుమార్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఉగ్రవాదం నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. ఇప్పటి చిత్రాలకు పూర్తి విభిన్నంగా రూపొందిన కథ ఇది. అందుకే అభిమానుల్లో విపరీతమైన ఆశక్తి నెలకొంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS