బిగ్ బాస్ ఇంటిలో సామ్రాట్ జిల్ జిల్.. జిగేల్..!

By iQlikMovies - August 01, 2018 - 16:11 PM IST

మరిన్ని వార్తలు

బిగ్ బాస్ హౌస్ లో సామ్రాట్ ఈరోజు “జిల్ జిల్” చేయనున్నాడు. దీనికి సంబందించి ఇప్పటికే విడుదలైన టీజర్ లో సామ్రాట్ ఝలక్ లు మనకి చూపించేశారు.

ఇదంతా చూస్తుంటే సామ్రాట్ కి వాళ్ళ అమ్మగారు, నాని ఇచ్చిన సూచనల ప్రకారం తన గేమ్ ని తాను ఆడటం మొదలుపెట్టాడు అని తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు మనకి కనిపిస్తున్న విధంగా ఇంటి సభ్యులనే గాక ప్రేక్షకులని కూడా ఎంటర్టైన్ చేస్తున్నాడు.

 

అయితే ఈ సీజన్ ప్రారంభంలో సామ్రాట్ ఎక్కువగా తేజస్వి తోనే మాట్లాడుతుండడం వేరే ఇంటి సభ్యులతో అంతగా కలవకపోవడం కూడా మనం చూశాము. కాని తేజస్వి హౌస్ నుండి వెళ్ళిపోయాక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది అని ఇది చూస్తే అర్ధమవుతుంది.

ఏదేమైనా సామ్రాట్ లో మనం చూస్తున్న ఈ కొత్త కోణం ఈ సీజన్ చివర వరకు ఉండాలని కోరుకుందాం....

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS