ఉయ్యాల జంపాల సినిమాతో అనూహ్యంగా టాలీవుడ్ లో హీరోగా అడుగుపెట్టిన రాజ్ తరుణ్ మొదటి సినిమాతోనే హిట్ కొట్టాడు. తరవాత వరుసగా సినిమాలు చేస్తూ నటుడిగా, రైటర్ గా ఎదిగాడు. హీరో కాక ముందు షార్ట్ ఫిలిమ్స్ డైరక్ట్ చేసి, నటించి ఫేమస్ అయ్యాడు. తరవాత హీరోగా నిలదొక్కుకున్నాడు. కెరియర్ మొదట్లో అవకాశాలు వచ్చినా అవి విజయం సాధించక పోవటంతో ఇప్పుడు కొంచెం స్లో అయ్యాడు. అడపా, దడపా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అసలే అంతంత మాత్రంగా ఉన్న కెరియర్ తో పాటు ఇప్పుడొక వివాదంలో చిక్కుకున్నాడు. నన్ను మోసం చేశాడంటూ లావణ్య అనే అమ్మాయి రాజ్ తరుణ్‌పై నార్సింగ్ పోలీసు స్టేషన్‌లో శుక్రవారం చీటింగ్ కేసు ఫైల్ చేసింది.
11 ఏళ్లుగా తాను, రాజ్ తరుణ్ రిలేషన్‌లో ఉన్నామని తెలిపింది. గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని, కానీ కొంతకాలంగా రాజ్ తరుణ్ ఒక హీరోయిన్‌తో అఫైర్ పెట్టుకుని, తనని దూరం పెట్టాడని, లావణ్య కేసు ఫైల్ చేసింది. రాజ్ తరుణ్ తో రిలేషన్ లో ఉన్న ఆ హీరోయిన్ తనని బెదిరిస్తోందని, రాజ్ ని వదిలి వెళ్లకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని ఆమె సోదరుడు కూడా బెదిరిస్తున్నారని తెలిపింది. ఇంతక ముందు కూడా ఇలాగే తనను అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించారని, 45 రోజులు జైల్లో ఉన్నానని లావణ్య తెలిపింది.
గత మూడు నెలలుగా రాజ్ ఇల్లు విడిచి వెళ్లిపోయాడని, తనని అస్సలు పట్టించుకోవటం లేదని వాపోయింది. ఇలా అమ్మాయిల పిచ్చి ఉన్న వారిని, అవసరానికి వాడుకుని వదిలేసే రాజ్ తరుణ్ లాంటి వారిపై చర్యలు తీసుకోవాలని లావణ్య డిమాండ్ చేస్తోంది. తనకు థ్రెట్ ఉండటం వలనే తాను కంప్లైంట్ ఇచ్చినట్లు పేర్కొంది. 11 ఏళ్లుగా తనని వాడుకుని ఇప్పుడు వదిలించుకోవాలని చూస్తున్నారని చెప్పింది. లావణ్య కంప్లైంట్ మేరకు రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీసులు కేస్ ఫైల్ చేశారు.