'ముని' ముసలోడైపోయాడే.!

మరిన్ని వార్తలు

డాన్స్‌ కొరియోగ్రాఫర్‌గా మంచి పేరు తెచ్చుకున్న లారెన్స్‌ రాఘవ హారర్‌ కామెడీ చిత్రాలతో దర్శకుడిగా అవతారమెత్తాడు. లారెన్స్‌ దర్శకత్వంలో వచ్చిన 'ముని' (కాంచన) సిరీస్‌ మూవీస్‌ మంచి విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు ఆ సిరీస్‌లో మూడో చిత్రం రానుంది. అదే 'కాంచన 3'. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ని తాజాగా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో లారెన్స్‌ ముసలి గెటప్‌లో కనిపిస్తున్నాడు.

 

లారెన్స్‌ది డిఫరెంట్‌ స్టైల్‌. ఎంతైనా స్టైలిష్‌ కొరియోగ్రాఫర్‌ కదా. యాక్టింగ్‌లో కూడా ఆ స్టైల్‌ ప్రదర్శిస్తుంటాడు. ముసలి గెటప్‌ అయినా ఈ లుక్‌లో కూడా స్టైల్‌ కనిపిస్తోంది. ఇకపోతే ఇంతవరకూ వచ్చిన 'కాంచన' సిరీస్‌ మూవీస్‌ తో పోల్చితే ఈ సినిమాలో హారర్‌ ఇంకాస్త ఎక్కువ భయపెట్టేలా ఉంటుందట. హారర్‌ అంటే దెయ్యాలు, భూతాలు. అవంటే అందరికీ భయం. అదే అంతవరకూ తెలుసు.

 

కానీ ఆ భయంలోంచే కామెడీ కూడా పుట్టించొచ్చునని లారెన్స్‌ 'ముని (కాంచన)' సిరీస్‌ ద్వారా నిరూపించాడు. డైరెక్టర్‌, రైటర్‌, ప్రొడ్యూసర్‌, హీరో ఇలా అన్నీ తానై సినిమాలు రూపొందిస్తుంటాడు లారెన్స్‌. ఏదైనా డిఫరెంట్‌గా ఉండాలనుకుంటాడు. అందుకే లారెన్స్‌ సినిమాలు ఎక్కువ జనాదరణ పొందాయి. ఇక 'కాంచన 3'ని ఠాగూర్‌ మధు తెలుగులోకి అనువదిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తయ్యిందట. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ ప్రకటించనున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS