గౌతమీపుత్ర శాతకర్ణి విడుదల తరువాత క్రిష్ చేయబోయే తరువాతి సినిమా ఏంటి అని అందరు ఆసక్తిగా చూశారు. అందరి అంచనాలు నిలబెడుతూ, ఝాన్సీరాణి పై మణికర్ణిక పేరుతో త్రిభాషా చిత్రం మొదలుపెట్టాడు.
అయితే ఇప్పుడు ఈ చిత్రంపైన నీలీ నీడలు కమ్ముకున్నాయి. వివరాల్లోకి వెళితే, కేతన్ మెహతా అనే దర్శకుడు, నటి కంగనా ని కలిసి కొంతకాలం క్రిందట ఝాన్సీ రాణి- ది వారియర్ క్వీన్ పేరుతో ఒక కథ చెప్పాడు. ఆ కథ నచ్చి, తను చేయబోయే తదుపరి చిత్రం అదేనని అనౌన్స్ చేసింది.
తరువాత కారణాలు తెలియవు కాని, ఈ చిత్రం ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే కథ పోలిన సబ్జెక్ట్ తో మణికర్ణిక అనే చిత్రం చేయనుండడంతో ఆ దర్శకుడు నటి కంగనాకి లీగల్ నోటిసులు పంపించాడు.
కేతన్ చెబుతున్న దాన్ని బట్టి, మణికర్ణిక కథ తన స్క్రిప్ట్ నుండి తీసుకున్న అంశాల నుండే తీస్తున్నారని ఆరోపిస్తున్నాడు. ఇక ఈ వివాదం పై కంగనా స్పందించాల్సి ఉంది.