తిరుమలలో అక్కినేని కోడలు సందడి

మరిన్ని వార్తలు

సమంతా ఇప్పుడు ఒక నటిగా కాకుండా అక్కినేని వారికి కాబోయే కోడలిగా బాగా వార్తల్లో నిలుస్తున్నది.

ఇక ఈ మధ్యనే సమంతా-నాగార్జున మధ్య జరిగిన సంభాషణని నాగ్ ట్విట్టర్ లో పోస్ట్ చేసినప్పటి నుండి సమంతా అక్కినేని వారితో ఎంతలా కలిసిపోయిందో ఇట్టే తెలిసిపోయింది. అయితే నేటి ఉదయం సమంతా తిరుమలలో ప్రత్యక్షం అవ్వడంతో అందరు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు.

ఇప్పటికే చైతు-సమంతాల వివాహ తేది అక్టోబర్ 2న అని అది కూడా గోవా లో జరగబోతుంది అని పుఖార్లు షికారు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో సమంతా తిరుమలలో ప్రత్యక్షం అవ్వడంతో ఈ పుఖర్లకి బలం చేకూరినట్టయింది.

అయితే సమంతా మొక్కు తీర్చుకోవాడానికి వచ్చిందని అది తన పెళ్ళికి సంబందించిన మొక్కు అని మళ్ళీ పుఖార్లు మొదలయ్యాయి. ఏదేమైనప్పటికీ సమంతా-చైతుల పెళ్ళీ పుఖారు రాయుళ్ళకి మంచి కాలేక్షపంగా మారింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS