ఫైర్‌ బ్రాండ్‌ కంగనా కూల్‌ కామెంట్‌!

మరిన్ని వార్తలు

మేం శ్వాస తీసుకున్నా వారికి సమస్యగానే ఉంటుందంటోంది ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌. ఆమె నటించిన 'జడ్జిమెంట్‌ హై క్యా' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌ వేగవంతమయ్యాయి. అందులో భాగంగా టైటిల్‌ మార్పుపై కంగనా స్పందించింది. 'మెంటల్‌' అనే పదాన్ని బ్యాన్‌ చేశారని తనకు తెలియదనీ, ఆ పదాన్ని సినిమాలకు టైటిల్‌గా వాడకూదనే నియయం అంతకన్నా తెలియదని కూల్‌గా తెలిపింది కంగనా.

 

నిజానికి కంగనా ఇస్టైల్‌ ఇది కానే కాదు. ఎందుకో కంగనా కామ్‌గా ఉంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే చాలా చాలా వివాదాలు చుట్టుముట్టాయి. ఆ మాటకొస్తే, కంగనా సినిమా అంటేనే చాలు వివాదాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేస్తుంటాయ్‌. స్వశక్తితో ఎదిగి స్టార్‌డమ్‌ సంపాదించుకున్న హీరోయిన్‌ కంగనా. ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి ఆ స్థానాన్ని దక్కించుకుంది. ఓ స్థాయికొచ్చాక కంగనా బలంగా తన గళం విప్పడం మొదలు పెట్టింది. అందుకే కంగనా పరిస్థితిని ఎవ్వరూ తప్పు పట్టేందుకు వీల్లేదనేది కొందరి అభిప్రాయం.

 

ఇక వివాదాలంటారా.? సినిమాలకు అవి ఫ్రీ పబ్లిసిటీలే. మరోవైపు పర్‌ఫామెన్స్‌లోనూ కంగనాని వంక పెట్టేవారు లేరు. ఇటీవల ఆమె నటించిన 'మణికర్ణిక' తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా చుట్టూ అనేక వివాదాలు ముసురుకున్నా, ఎట్టకేలకు 'మణికర్ణిక' ఫర్వాలేదనిపించింది. అయితే, ఆశించిన రిజల్ట్‌ని అందుకోవడంలో మాత్రం 'మణికర్ణిక' విపలైమైందనే చెప్పాలి. ఇక తాజా చిత్రం 'జడ్జిమెంటల్‌ హై క్యా' ఏమవుతుందో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS