కంగనా రనౌత్ ఎప్పుడూ ఓ చోట కుదురుగా కూర్చోదేమో..? ఎప్పుడూ ఏదో విషయంలో కెలుకుతూనే ఉంటుంది. దాంతో ఆమె చుట్టూనే వివాదాలు చేరతాయి. తాజాగా.. దేశ స్వాతంత్య్రం కోసం ఆమె కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. 1947లో దేశానికి వచ్చింది స్వాతంత్య్రం కాదని, భిక్ష అని సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. రాజకీయ పక్షాలులు. పార్టీలకు అతీతంగా కంగనపై విరుచుకుపడుతున్నారంతా. కంగనాని ఓ విలాసవంతమైన బిచ్చగత్తెగా పేర్కొంటూ సీపీఐ నారాయణ కంగనాపై ధ్వజమెత్తారు.
కంగనా ఓ దేశ ద్రోహి అని, ఆమెకిచ్చిన పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. స్వాతంత్య్రంపై ఏమాత్రం అవగాహన లేని కంగనా, తన వ్యాఖ్యలతో స్వాతంత్య్ర సమర యోధుల పోరాటాన్ని అవమాన పరిచిందని, ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని శివసేన డిమాండ్ చేస్తోంది. ఇటీవలే కంగనా పద్మశ్రీ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ అవార్డు అందుకున్న తరవాత.. కంగనా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. మరి ఈ విమర్శలపై కంగనా ఎలా స్పందిస్తుందో చూడాలి.