ఈమధ్య సోషల్ మీడియాలో ఆకతాయిల చేష్టలు ఎక్కువయిపోయాయి. ఏకంగా `రేప్` చేస్తామంటూ సోషల్ మీడియాలోనే బహిరంగంగా భయపెడుతున్నారు. తాజాగా కంగనా రనౌత్కీ ఇలాంటి బెదిరింపులు వచ్చాయి.
కంగనా రనౌత్ సోదరుడికి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ట్విట్టర్లో కంగనా షేర్ చేశారు. వాటిపై కామెంట్ చేస్తూ ఒడిశాకు చెందిన న్యాయవాది నుండి నడిరోడ్డుపై అత్యాచారం చేస్తానంటూ కామెంట్స్ పెట్టాడు. దాంతో కలకలం రేగింది. ఓ న్యాయవాది అయ్యుండి, ఇలా దిగజారి పోయి కామెంట్లు చేయడం ఏమిటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అయితే ఈ వ్యవహారంపై స్పందించిన న్యాయవాది తన ఫేస్బుక్ అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేశారని, ఆ కామెంట్లు తాను పెట్టలేదని క్లారిటీ ఇచ్చాడు. తనకి స్త్రీలు, సమాజంపై గౌరవం ఉందని, అసభ్యకరమైన కామెంట్స్ వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించండి అంటూ ఆ న్యాయ వాది ప్రాధేయ పడ్డాడు. అంతేకాదు... వెంటనే తన ఫేస్బుక్ అకౌంట్‌ను డిలీజ్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏం స్పందించలేదు. కాకపోతే ఈ విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కామెంట్లు ఎవరు చేశారు? దాని వెనుక ఆంతర్యం ఏమిటి? అనే విషయంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
After Rangoli’s wedding for more than a decade there was no wedding in the family all thanks to me but today my brothers Karan and Aksht broke the jinx and our ancestral house is drowned in wedding festivities, two weddings in three weeks starting with Karan ki Haldi today 🧡 pic.twitter.com/9SCl95c2OG
— Kangana Ranaut (@KanganaTeam) October 20, 2020