భక్త కన్నప్ప: పార్వతిగా ఫైర్ బ్రాండ్

మరిన్ని వార్తలు

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ భక్త కన్నప్ప గూర్చి ఎలాంటి న్యూస్ వచ్చినా క్షణాల్లో వైరలవుతోంది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన దగ్గరనుంచి విపరీతమైన బజ్ ఏర్పడింది. ఈ మూవీలో భారీ తారాగణం ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ మూవీ కీలక షెడ్యూల్ న్యూజిలాండ్ లో జరిగింది. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ  ఫాంటసీ డ్రామాలో ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటిస్తోంది. తన కొడుకు కూడా ఈ మూవీలో నటిస్తున్నాడని విష్ణు రివీల్ చేసిన సంగతి తెలిసిందే. అంటే మూడు తరాల మంచు ఫ్యామిలీ ఇందులో కనిపించనున్నారు. ఈ మూవీలో శివుడిగా  ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా పార్వతిగా  లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది అన్న వార్తలు వచ్చాయి.


కానీ లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం పార్వతి దేవి పాత్రలో ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్  నటించనున్నట్లు సమాచారం. కంగనా అయితే ఈ పాత్రకి సరిగ్గా సరిపోతారని, పానిండియా సినిమా కావటంతో కంగనాకు మేకర్స్ ఓటు వేశారని టాక్. ఏక్ నిరంజన్ లో ప్రభాస్, కంగనా కలిసి నటించారు మళ్ళీ ఇన్నాళ్లకు ఈ జోడి తెరపై సందడి చేయనుంది. ఎప్పటి నుంచో టాలీవుడ్ సినిమాల్లో సెకండ్ ఛాన్స్ కోసం చూస్తున్న కంగనాకు ఇప్పుడు భక్త కన్నప్ప తో ఛాన్స్ దొరికింది.


శివరాజ్ కుమార్, రాధికా, బ్రహ్మానందం, శరత్ కుమార్,  తదితరులు నటిస్తున్న ఈ మూవీ గురించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయట. ఈ మూవీ పూర్తి అయ్యేసరికి ఇంకెన్ని విశేషాలు చోటు చేసుకుంటాయో చూడాలి. ఏ వి ఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు ఈ మూవీని నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో 'భక్త కన్నప్ప' రిలీజ్ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS