గాంజా శంకర్ ఆగిపోలేదా!

మరిన్ని వార్తలు

మెగా మేనల్లుడు సాయి ధర్మ తేజ్ యాక్సిడెంట్ తర్వాత సినిమాల జోరు తగ్గించారు.  కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. లాస్ట్ ఇయర్  విరుపాక్షతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తేజ్ నెక్స్ట్ తన మావయ్య తో   'బ్రో' సినిమా చేసాడు. ఈ మూవీ మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది.  పవన్ కళ్యాణ్ కోసం కొందరు ఈ సినిమా చూసారు అనటంలో సందేహం ఏమి లేదు.  ఈ మూవీ నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది.  సాయి తేజ్ కి ప్రజంట్ మార్కెట్ లేకపోవటంతో ఆఫర్స్ కూడా పెద్దగా రావటం లేదు.  నాలుగు నెలలు క్రితం సంపత్ నంది డైరక్షన్లో సాయి తేజ్ హీరో గా ఒక సినిమా అనౌన్స్ చేశారు. అదే 'గాంజా శంకర్' మూవీ. కానీ ఈ మూవీ కూడా ఆగిపోయిందని, కారణం సాయి తేజ్ పారితోషికం ఎక్కువ డిమాండ్ చేయటం వలన అని ప్రచారం జరిగింది.  ఈ రూమర్స్ కి చెక్ పెడుతూ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
  

గాంజా శంకర్ మూవీ ఆగిపోలేదని, ఈ సినిమాలో హీరోయిన్ మారిందని సమాచారం. మొదట ఈ సినిమాకి పూజా  హెగ్డేను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఇప్పుడు పూజా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట.  నిధి అగర్వాల్ ని తీసుకున్నారని తెలుస్తోంది. ఈ మూవీలో హీరోయిన్ పాత్ర మిడిల్ ఏజ్, డీ గ్లామర్ రోల్ కావడంతో పాటు జైల్ లో ఉండే పాత్ర కావటంతో పూజా నో చెప్పటంతో మేకర్స్  నిధికి ఈ అవకాశం ఇచ్చినట్టు సమాచారం.  నిధి అగర్వాల్ కి ఇప్పటివరకు ఇస్మార్ట్ శంకర్ తప్ప చెప్పుకోదగిన హిట్ లేదు. టాలీవుడ్ , కోలీవుడ్ లలో నటించినా సరైన గుర్తింపు రాలేదు.


నిధి ప్రజంట్ పవన్ కళ్యాణ్ తో  హరిహర వీరమల్లు సినిమాలో, మారుతి డైరక్షన్లో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాజా సాబ్ మూవీలో కూడా చేస్తోంది. ఇప్పుడు గాంజా శంకర్ లో కూడా ఛాన్స్ లభించింది. మెగా కాంపౌండ్ లోకి ఒకసారి ఎంటర్ అయితే ఛాన్స్ లు పక్కా, ఇక నిధి లైఫ్ సెటిల్ అయినట్టే అని సినీ విశ్లేషకులు అంటున్నారు.  ఇంకో వైపు ప్రభాస్ తో నటిస్తుండటంతో పాన్ ఇండియా గుర్తింపు వచ్చినట్టే. ఈ దెబ్బతో నిధి లైఫ్ మారనుందేమో చూడాలి. గాంజా శంకర్ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ రూపొందిస్తున్నారు.  భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS