స్పెషల్‌: ముప్పైల్లో ‘తలైవి’ని చూశారా.?

By Inkmantra - February 24, 2020 - 13:00 PM IST

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘తలైవి’. ఎ.ఎల్‌.విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రం దివంగత నేత జయలలిత బయోపిక్‌ ఆధారంగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ రోజు జయలలిత పుట్టినరోజు సందర్భంగా లేటెస్ట్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. జయలలిత ముప్పైల కాలం నాటి లుక్స్‌లో ఉన్న ఈ పోస్టర్‌లో కంగన హావభావాలు ఆకట్టుకుంటున్నాయి. ముప్పైల కాలంలో జయలలిత అచ్చు ఇలాగే ఉందా.? అనిపించేలా ఉన్న ఈ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

 

ఈ సినిమా కోసం కంగనా చాలా కష్టపడుతోంది. పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తోందనాలేమో. ఇటీవల విడుదలైన సాంప్రదాయ నృత్య కారిణి గెటప్‌లో రిలీజ్‌ చేసిన కంగనా స్టిల్‌ మెస్మరైజ్‌ చేసింది. ఇక ఈ సినిమాలో ప్రియమణి, ప్రకాష్‌ రాజ్‌ తదితరులు ఇతర కీలక పాత్రల్లో మెప్పించనున్నారు. అందాల భామ పూర్ణకూ ఈ సినిమాలో ఓ మంచి అవకాశం దక్కింది. లేటెస్ట్‌గా ఆమె పేరును అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్‌. అలాగే, జయలలిత బయోపిక్‌కి సంబంధించి మరో ముఖ్యమైన పాత్రధారి పెద్దాయన ఎంజీఆర్‌. హ్యాండ్‌సమ్‌ నటుడు అరవింద్‌ స్వామి పోషిస్తున్న ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ కొన్ని నెలల క్రితం రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాత్రకు అరవింద్‌ స్వామి సరిగ్గా సూటయ్యారనే టాక్‌ వచ్చింది. ఇకపోతే, దాదాపు 90 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ త్వరలో ప్రకటించనున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS