నాని ‘హిట్‌’ మూవీ కోసం ‘బాహుబలి’ అతిధులు.!

మరిన్ని వార్తలు

గతేడాది ‘జెర్సీ’, ‘గ్యాంగ్‌లీడర్‌’ సినిమాలతో వరుస హిట్లు కొట్టి ఫుల్‌ స్వింగ్ లో వున్న నాని ఈ ఏడాది మరింత జోరు పెంచాడు. ఏకంగా మూడు సినిమాలు లైన్‌లో పెట్టేశాడు. అందులో ఒకటి ఆయన నిర్మాణంలో రూపొందుతోన్న ‘హిట్‌’ మూవీ. ఏదో చిన్న సినిమాగా స్టార్ట్‌ అయిన ఈ సినిమా ఇప్పుడు పెద్ద సినిమాలా మారిపోయింది. లేటెస్టుగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించాడు నేచురల్‌ స్టార్‌ నాని. జక్కన్న, అనుష్క, రానా వంటి బాహుబలి అతిథుల్ని ఆహ్వానించాడు. ఈ ఈవెంట్‌లో బాహుబలి అతిధులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు, స్టేజ్‌పై జక్కన్న గొడ్డలి పట్టి, ‘హిట్‌’ సినిమాకి ప్రమోషన్లు అదరగొట్టేయగా, దేవసేన అనుష్క విల్లు ఎక్కుపెట్టి ‘హిట్‌’ అప్పియరెన్స్‌ ఇచ్చింది.

 

ఈ ఈవెంట్‌లో జక్కన్నతో పాటు, అనుష్క స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. అంతేకాదు, అల్లరి నరేష్, నవదీప్‌, సునీల్‌ తదితర నటులు ఈ ఈవెంట్‌కి విచ్చేసి, ‘హిట్‌’ మూవీ సూపర్‌ ‘హిట్‌’ అవ్వాలని ఆకాంక్షించారు. శైలేష్‌ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నాని 'వాల్‌ పోస్టర్‌' బ్యానర్‌లో ప్రతిష్ఠాత్మకంగా రూపొందింది. ‘ఫలక్‌నుమాదాస్‌’ ఫేమ్‌ విశ్వక్‌సేన్‌ హీరోగా నటించగా, ‘చిలసౌ’ ఫేమ్‌ రుహానీ శర్మ హీరోయిన్‌గా మెరిసింది. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘హిట్‌’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌తో ప్రమోషన్‌ సూపర్‌ ‘హిట్‌’ కొట్టింది. కాగా, క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్స్‌తో ఏర్పడిన అంచనాలు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌తో నెక్స్‌ట్‌ లెవల్‌కి చేరుకున్నాయి. చూడాలి మరి, ‘అ’ తర్వాత వాల్‌ పోస్టర్‌ బ్యానర్‌లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్‌ అందుకుంటుందో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS