ఆ దర్శకుడు నన్ను వేధించాడు: కంగనా రనౌత్

మరిన్ని వార్తలు

ఈమధ్య కాలంలో సినిమా పరిశ్రమలో ‘కాస్టింగ్ కవుచ్’ అంశం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది.

ప్రధానంగా హీరోయిన్లు తమకి ఎదురైనా చేదు అనుభవాలని #meetoo అంటూ అందరితో పంచుకుంటున్నారు. అలా ఈ మధ్యనే నటి తనుశ్రీ దత్తా ప్రముఖ నటుడు అయిన నానా పాటేకర్ పైన కొన్ని వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారాన్నే రేపాయి.

తాజాగా నటి కంగనా రనౌత్ తనని ఒక దర్శకుడు లైంగికంగా వేధించాడు అంటూ సంచలన ప్రకటనలు చేసింది. ఇంతకి ఆ దర్శకుడు ఎవరంటే కంగనా ని ప్రధాన పాత్రలో పీతి తీసిన ‘క్వీన్’ చిత్ర దర్శకుడు వికాస్. ఉదయం నుండి ఈ వార్త దావానంలా వ్యాపిస్తు బాలీవుడ్ లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నది.

ఈ అంశం పై దర్శకుడు వికాస్ ఇంకా స్పందించలేదు. ఏదేమైనా రోజుకొకటి ఇలాంటి వార్తలు బయటకి వస్తుండడం శోచనీయం...

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS