బాంబ్‌ పేల్చిన కంగనా: బాలీవుడ్‌లో భూకంపం.!

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ నటించిన 'మణికర్ణిక' ఈ మధ్య ఎన్ని వివాదాలు మూట కట్టుకుందో ఇప్పటికే కథలు కథలుగా చెప్పేసుకున్నాం. ఇక తాజాగా కంగనా మరో బాంబ్‌ పేల్చింది. తన బయోపిక్‌ని తెరకెక్కిస్తున్నానని చెప్పింది. ఈ సినిమాకి తానే దర్శకత్వం వహిస్తుందట కంగనా.

 

ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌ కథను సిద్ధం చేయనున్నారనీ తెలుస్తోంది. ఇకపోతే కంగనాకి 'క్వీన్‌' అనే బిరుదు అంత తేలిగ్గా రాలేదు. ఎన్నో కష్ట నష్టాల్ని ఓర్చాల్సి వచ్చింది. మోడలింగ్‌ రంగం నుండి వెండితెరకు పరిచయమై, మొదట్లో ఓ మోస్తరు అవకాశాలు అందుకోవడానికి కూడా చాలా కష్టపడింది. చాలా చాలా ఒత్తిడికి గురైంది. పలు సందర్భాల్లో ఈ అంశాలను బోల్డ్‌గా కంగనానే స్వయంగా పేర్కొంది. ఇక ఇప్పుడు బాలీవుడ్‌లో కంగనా ఓ స్టార్‌ హీరోయిన్‌. హీరోలకు ధీటుగా సత్తా చాటుతోంది. ఇదిలా ఉంటే, ఎవ్వర్నీ లెక్క చేయదు, ఫైర్‌ బ్రాండ్‌.. నోటికొచ్చినట్లు సంచలన వ్యాఖ్యలు చేస్తుంటుంది.. అని పలు రకాల విమర్శలు కంగనాపై ఉన్నాయి. ఇటీవల 'మణికర్ణిక' కారణంగా మరింత నెగిటివిటీని మూట కట్టుకుంది కంగనా.

 

అయితే ఈ తాజా నిర్ణయంతో కంగనా ఇంకెన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందో కానీ, కంగనా బయోపిక్‌ అంటే, బాలీవుడ్‌లో పలువురు స్టార్‌ హీరోలు, దర్శకులు, ఇతర టెక్నీషియన్లు టెన్షన్‌ పడుతున్నారట. అసలే కంగనా అంటే డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌. ఇక తన బయోపిక్‌ నిర్ణయం ఇంకెన్ని సంచలనాలకు, విమర్శలకు, వివాదాలకు దారి తీస్తుందో చూడాలిక. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS