ముద్దుగుమ్మ ముద్దుల పండగ.!

By iQlikMovies - February 14, 2019 - 16:37 PM IST

మరిన్ని వార్తలు

అందం ఉంది, ఆకట్టుకునే ఫిగర్‌ ఉంది. ఎక్స్‌పోజింగ్‌కి అస్సలు మొహమాటాల్లేవ్‌. కానీ ఏం చేస్తాం ఎట్రాక్ట్‌ చేయాల్సిన వాళ్లని ఎట్రాక్ట్‌ చేయలేకపోతోంది. 'హేట్‌ స్టోరీ 4'లో హాట్‌ హాట్‌ అందాలతో రెచ్చిపోయి, కుర్రకారు మతులు పోగొట్టేసిన ఈ ముద్దుగుమ్మ ఊర్వశీ రౌతెల్లా గురించి మనం చర్చించుకుంటున్నాం.

 

ఎంత అందముంటేనేమి.. అవకాశాలు అంతంత మాత్రమే. ఇంతటి అందాన్ని అడవి కాసిన వెన్నెలలా వదిలేస్తున్నారు బాలీవుడ్‌ క్రియేటివ్‌ జనం. సో లేటెస్ట్‌గా ఈ బ్యూటీ తన అందాలకు టాలీవుడ్‌లో పదును పెట్టాలని అనుకుంటోందట. ఇప్పటికే ఓ యంగ్‌ హీరో సినిమా కోసం సంప్రదింపులు జరుగుతున్నాయనీ సమాచారమ్‌. ఒక్కసారి క్లిక్‌ అయ్యిందంటే చాలు, టాలీవుడ్‌ ప్రేక్షకులు ఈ అందాల ఊర్వశి సౌందర్యానికి భక్తులైపోరూ.! తాజాగా ఎల్లో కలర్‌ చెమ్కీ కలర్డ్‌ హాఫ్‌ గాగ్రాలో చిరునవ్వులు చిందిస్తూ ఉన్న పిక్స్‌ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. 'హ్యాపీ కిస్‌ డే' అని ఈ పిక్స్‌కి క్యాప్షన్‌ ఇచ్చింది.

 

ఇంకేముంది కుర్రకారు ఈ అందాల రాణి కిస్సింగ్‌ కోసం పదే పదే లైకింగ్‌ పోస్ట్‌లిచ్చేస్తున్నారు. ఛాన్సెందుకు మిస్‌ చేసుకోవడం మీరు కూడా ఓ ట్రైల్‌ వేస్కోండి బాస్‌.! 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS