ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సోదరి రంగోలీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమెకి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకున్నా, సోషల్ మీడియాలో అవాకులు చవాకులు పేలుతూ , పిచ్చ పాపులారిటీ సంపాదించింది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న తరుణంలో కరోనా గురించి ఓ ఫేక్ న్యూస్ పోస్ట్ చేసింది రంగోలీ. ఆ ఫేక్ న్యూస్ కారణంగా ఆమె ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ చేసారు ట్విట్టర్ నిర్వాహకులు. ఇందులో వింతేముందనుకుంటున్నారా? ట్విస్ట్ ఏంటంటే, ఆ అకౌంట్ రంగోలీది కాదు, తన సోదరి కంగనాది అని తేలిందట. దాంతో కంగనానే చెల్లెలితో ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయించిందంటూ ప్రచారం జరుగుతోంది.
అప్పుడప్పుడూ తన మనోగతాన్ని చెల్లెలి ద్వారా కంగనానే సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తుంటుందనే ఆరోపణలు గతంలోనూ కంగనాపై ఉన్న కారణంగా, ఈ తాజా ఫేక్ న్యూస్ ప్రచారానికి కూడా కంగనానే కారణమై ఉంటుందన్న అనుమానానికి బలం ఏర్పడింది. అలా వివాదాలతో సావాసం చేసే కంగనా అకౌంట్‌లో ఈ కారణంగా మరో లేటెస్ట్ వివాదం వచ్చి చేరింది. కరోనాపై ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే కఠిన శిక్షలు తప్పవంటూ సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఆర్డర్ ఉన్న తరుణంలో రంగోలీ చేసిన పనికి అడ్డంగా బుక్కయిపోయిన కంగనా ఎలా బయట పడుతుందో చూడాలి మరి. ఇకపోతే, ప్రస్తుతం, దివంగత ముఖ్యమంత్రి జయలిత బయోపిక్‌లో కంగనా నటిస్తోన్న సంగతి తెలిసిందే. బహు భాషా చిత్రంగా ఈ సినిమా రూపొందుతోంది.