కరోనా వైరస్ కారణంగా నెలకొన్న ‘లాక్ డౌన్’ సిట్యుయేషన్‌లో సెలబ్రిటీలు అభిమానులకు దగ్గరగా వుండేందుకు సోషల్ మీడియాని అద్భుతంగా వాడేస్తున్నారు. ‘అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దు..’ అంటూ కరోనా జాగ్రత్తలు చెప్పడమే కాదు, ఇంట్లోనే వుండి ఎలా కాలక్షేపం చెయ్యొచ్చో కూడా చేసి చూపిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఇంట్లో వంట చేసేస్తున్నాడట. గరిట తిప్పడంలో చరణ్‌కి మంచి ప్రావీణ్యమే వుందంటూ తన భర్త గురించి గొప్ప గొప్పగా చెప్పేస్తోంది చరణ్ సతీమణి ఉపాసన. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ ఫొటోని షేర్ చేసింది.
మరోపక్క మెగాస్టార్ చిరంజీవి, తన ఇంట్లో ‘నడక దారి’ని శుభ్రం చేస్తూ దీనికి సంబంధించి ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘మనం నడిచే దారి ఎప్పుడూ శుభ్రంగా వుండాలి..’ అంటూ ఓ అద్భుతమైన సోషల్ మెసేజ్ చిరంజీవి ఈ వీడియో పోస్ట్ చేయడం ద్వారా ఇచ్చారన్నమాట. ఈ మధ్యనే చిరంజీవి సోషల్ మీడియాలోకి ‘మెగా’ ఎంట్రీ ఇచ్చారు. చరణ్ కూడా ట్విట్టర్ ద్వారా కాస్త యాక్టివ్‌గానే వుంటున్నాడు. చరణ్‌తో పోల్చితే, ఇక్కడా చిరంజీవిదే పైచేయి. తమ ‘బాస్’ సోషల్ మీడియాలో ఇంత యాక్టివ్‌గా వుండడం చూసి మెగా అభిమానులు ఓ రేంజ్‌లో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. సరదా సంభాషణలు, తనదైన ‘మెగా’ చెణుకులతో చిరంజీవి హల్‌చల్ చేస్తోంటే అభిమానుల ఆనందానికి ఆకాశమే హద్దు అని వేరే చెప్పాలా?
The paths we take should always be clean #LockdownActivities #StayHomeStaySafe pic.twitter.com/7Ie4frsTut
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 16, 2020