పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కువ శాతం తనలోని కోపాన్ని బహిరంగంగా ప్రదర్శించాడు. కేవలం రాజకీయ ప్రసంగాల్లో తప్పించి వేరే చోట్ల ఆయన తన కోపాన్ని ప్రదర్శించిన దాఖలాలు పెద్దగా లేవు.
అయితే ఆయన ఒక కమెడియన్ పైన కోప్పడినట్టు ఒక వార్త ఇప్పుడు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నది. ఆ వార్త ప్రకారం, పవన్ తన చిత్ర షూటింగ్ లో ఒక కమెడియన్ అనవసరంగా రాజకీయాల గురించి అలాగే జనసేన పార్టీ గురించి మాట్లాడుతుండడంతో ఆయన సదరు కమెడియన్ పైన అసహనంతో పాటు కోపాన్ని కూడా ప్రదర్శించాడట.
అయితే పవన్ గురించిన తెలిసిన వారు మాత్రం ఇది తప్పుడు వార్త అయి ఉండొచ్చు అని అలాగే ఒకవేళ ఈ వార్తలో నిజముంటే ఆ కమెడియన్ ప్రవర్తనే పవన్ కోపానికి కారణం అయి ఉండొచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మొత్తానికి పవర్ స్టార్ చేత తిట్లు తిన్న ఆ ప్రముఖ కమెడియన్ ఎవరైవుంటారో?