రష్మిక.. ఇప్పుడు నేషనల్ క్రష్ కావొచ్చు గాక..కానీ సొంత కన్నడ సీమలో సినీ అభిమానులు ఆమెపై గుర్రుగా ఉన్నారు. రష్మికని కన్నడ పరిశ్రమ బ్యాన్ చేయాలంటూ... సోషల్ మీడియాలో రష్మికని తెగ ట్రోల్ చేస్తున్నారు. దానికీ బలమైన కారణం ఉంది.
రష్మిక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు కన్నడీగుల ఆగ్రహానికి గురయ్యాయి. తనకు తొలి అవకాశం ఇచ్చిన కన్నడ చిత్రసీమకు చెందిన నిర్మాణ సంస్థ పేరు చెప్పమంటే... జవాబు దాటేసింది. `సో కాల్డ్ ప్రొడక్షన్ హౌస్` అంటూ... ఆ పేరు ఉచ్చరించడానికి కూడా రష్మిక మనసు ఒప్పుకోలేదు. దానికి కారణం.. ఆ ప్రొడక్షన్ హోస్ తనమాజీ ప్రియుడు రక్షిత్ శెట్టికి సంబంధించినది కావడమే. రక్షిత్ శెట్టిని ప్రేమించి, నిశ్చితార్థం వరకూ వెళ్లి.. విడిపోయిన సంగతి తెలిసిందే. అందుకే.. రష్మిక ఆ పేరు పలకలేకపోయింది. అంతే కాదు.. `కాంతారా` ప్రస్తావనకు వచ్చినప్పుడు ` ఆసినిమా ఇంకా చూడలేదు. నాకంత టైమ్ లేదు` అనేసింది. ఇది రక్షిత్ శెట్టి సోదరుడు రిషబ్ శెట్టి సినిమా. అందుకే ఆ సినిమా చూడలేదు రష్మిక. కన్నడ చిత్ర ఖ్యాతిని పెంపొందించిన సినిమాని చూడలేదని చెబుతున్న రష్మిక సినిమాలు కన్నడలో ఎలా ఆడతాయి? ఆమెకు కన్నడ పరిశ్రమ ఎందుకు అవకాశాలు ఇవ్వాలి? అనేది కన్నడీగుల ప్రశ్న. ఈ విషయం ముదరకముందే.. రష్మిక స్పందించాలి. తగిన వివరణ ఇవ్వాలి. లేదంటే.. రష్మికు సొంతింట్లో.... శుత్రువులు పోగయ్యే ప్రమాదం ఉంది.