నటీనటులు: ప్రదీప్ రంగనాథన్, సత్యరాజ్, యోగి బాబు, ఇవానా, రాధిక శరత్‌కుమార్, తదితరులు.
దర్శకుడు : ప్రదీప్ రంగనాథన్
నిర్మాత: కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్.గణేష్, కల్పాతి ఎస్.సురేష్
సంగీత దర్శకులు: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ: దినేష్ పురుషోత్తమన్
రేటింగ్ : 3/5
చిన్నాపెద్దా అనే తేడా లేదు...కంటెంట్ బావుంటే కోటి రుపాయిల సినిమా కూడా ఇండస్ట్రీ రికార్డ్ ని బ్రేక్ చేయగలదు. లవ్ టుడే కూడా తమిళంలో ఇలా ఇండస్ట్రీని బ్రేక్ చేసిన సినిమానే. కేవలం ఐదు కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా దాదాపు డెబ్బై కోట్లు వసుళ్ళూ సాధించి ఈ ఏడాది తమిళ్ లో అత్యంత ప్రాఫిటబుల్ సినిమాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం చాలా ప్రయత్నాలు జరిగాయి. అయితే అమ్మడానికి ఇష్టపడలేదు. దీంతో నిర్మాత దిల్ రాజు డబ్ చేసి అదే టైటిల్ తో తెలుగులో తీసుకొచ్చారు. ఇంతకీ తమిళ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన లవ్ టుడేలో ప్రేక్షకులని అలరించే అంశాలెంటో చూద్దాం.
కథ :
ప్రదీప్ (ప్రదీప్ రంగనాథన్) నిఖిత (ఇవానా) ఇద్దరూ ప్రేమికులు. అయితే వీరి పెళ్లికి ఇవానా తండ్రి వేణు శాస్త్రి (సత్య రాజ్) ఓ కండీషన్ పెడతాడు. ఇద్దరూ తమ తమ ఫోన్‌లు మార్చుకుని ఒక రోజు రోజంతా వుండాలి. ఆ తర్వాత కూడా పెళ్లి చూసుకోవాలని అనిపిస్తే.. పెళ్లి చేయడానికి తనకు అభ్యంతరం లేదని చెప్తాడు. ప్రదీప్, నిఖితలు ఆ కండీషన్ కి ఒప్పుకుంటారు. ఇలా ఫోన్లు మార్చుకున్న ప్రదీప్, నిఖితల మధ్య ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి? అసలు వారి స్వరూపాలు ఏంటి ? ఒకరి గురించి ఒకరు ఎలాంటి నిజాలు తెలుసుకున్నారు ? చివరికి ఒక్కటయ్యారా? లేదా ? అనేది మిగతా కథ.
విశ్లేషణ :
ఈ సినిమా హీరో, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ యూత్ తో పాటు అందరికీ కన్తెక్ట్ అయ్యే పాయింట్ ని పట్టుకున్నాడు. మనిషి సెల్ ఫోన్ కి ఎలా అలవాటైపోయాడు చెప్పనవసరం లేదు. ముఖ్యంగా యువత. బోలెడు యాప్లు, మెసెంజర్లు, డేటింగ్ చాటింగ్ సైట్లు అర చేతిలో పట్టుకొని తిరుగుతుంటారు. అలాంటి ఒక అమ్మాయి, అబ్బాయి తమ ఫోన్ ని ఒక రోజు మార్చుకుంటే ఒకరికి తెలియని ప్రపంచం మరొకరి ఎంత వింతగ కొత్తగా ఆశ్చర్యంగా షాకింగ్ తెలుస్తుందనేది లవ్ టుడే కథాంశం. దిన్ని యూత్ కి కనెక్ట్ అయ్యేలా చాలా ఎంటర్ టైనింగ్ గా ప్రజంట్ చేశాడు దర్శకుడు.
ఇద్దరూ ఫోన్లు మార్చుకోవడంతో అసలు కథ మొదలౌతుంది. దిని తర్వాత వచ్చే సన్నివేశాలని చాలా ఫన్ ఫుల్ గా డిజైన్ చేశాడు దర్శకుడు. ఫోన్ కోసం పడే పాట్లు, చార్జర్ కోసం హీరో వెతుకులాట, హీరోయిన్ షాకింగ్ చాటింగులు, అటు యోగి బాబు పెళ్లి చూపులు, ప్రదీప్ అక్క పెళ్లి సందడి అన్నీ యూత్ ఫుల్ ఎంటర్ టైమెంట్ ఇస్తాయి. ఫస్ట్ అంతా చాలా సరదాగా కాలక్షేపం అయిపోతుంది.
అయితే సెకండ్ హాఫ్ కి వచ్చేసిరికి ఫన్ తో పాటు ఎమోషన్ ని కూడా జోడించారు. హీరోయిన్ చెల్లి ఒక ఆకతాయి నుండి వచ్చిన మెసేజ్ హీరో మెడకు చుట్టుకోవడం, ఆ విషయంలో హీరో హీరోయిన్ మధ్య గొడవ కథని సీరియస్ మూడ్ లోకి తీసుకెళ్తాయి. ఒక దశలో సందేశం ఇస్తున్నట్లుగాకూడా ఉంటుంది. అయితే దర్శకుడు రాసుకున్న యోగి బాబు ట్రాక్ మళ్ళీ కాస్త రిలీఫ్ ని ఇస్తుంది. చివర్లో మార్ఫింగ్ వీడియో భయపెట్టినా కాసేపటికి మళ్ళీ హ్యాపీ ఎండింగ్ తో కథని ముగించడం ఆకట్టుకుంటుంది.
నటీనటులు :
ప్రదీప్ రంగనాథన్ చాలా నేచురల్ గా నటించాడు. హీరోలా కాకుండా ఒక మామూలు కుర్రాడిలా ఆ పాత్రని డిజైన్ చేయడం ఆకట్టుకుంటుంది. అలాగే హీరోయిన్ ఇవానాకి కూడా మంచి మార్కులు పడాతాయి. వీరిద్దరి కెమిస్ట్రీ బావుంది. యోగి బాబు మరోసారి ఆకట్టుకున్నాడు. సత్యరాజ్ రాధిక పాత్రలు కూడా కథలో కీలకంగా వున్నాయి. వారి అనుభవంతో ఆ పాత్రలని చాలా ఈజీగా చేశారు. మిగతా పాత్రలు పరిధి మేర వున్నాయి
టెక్నికల్ :
సాంకేతికంగా సినిమా డీసెంట్ గా వుంది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అదనపు ఆకర్షణ. బుజ్జికన్నా డీజీ సాంగ్ ఆకట్టుకుంటుంది. కెమరాపని తనం నీట్ గా వుంది. డైలాగ్స్ నవ్విస్తాయి. కథ సరిపడా వనరులు సమకూర్చారు నిర్మాతలు. దర్శకుడిగా ప్రదీప్ కి ఫుల్ మార్కులు పడతాయి.
ప్లస్ పాయింట్స్
వినోదం
యూత్ ఫుల్ ఎలిమెంట్స్
మ్యూజిక్
మైనస్ పాయింట్స్
సెకండ్ హాఫ్ లో వినోదం తగ్గడం
అక్కడక్కడ కొన్ని సాగాదీత సీన్లు
ఫైనల్ వర్డిక్ట్ : లవ్ టుడే. యూత్ కి నచ్చేస్తుంది