ప్రముఖ యాంకర్, స్టాండ్ అప్ కమెడియన్ అయిన కపిల్ శర్మ ఆయన నిర్వహిస్తున్న షోలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
తెలియవస్తున్న సమాచారం ప్రకారం, షారుఖ్-అనుష్క నటించిన చిత్రం ప్రచారం సందర్భంగా ఈయన కామెడీ షో కి విచ్చేశారు. ఇక ఈ షో మొదలయ్యే కొద్దిసేపటి ముందు కపిల్ శర్మ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో వెంటనే ఆయనని దగ్గరిలోని ఆసుపత్రికి తరలించారు.
ఈ మధ్యకాలంలో ఆయన ఇలా అస్వస్థతకు గురవ్వడం ఇది రెండోసారి. ఆయన షోకి సంబందించిన పనుల వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్టు, దీని వలన ఆయన అధిక రక్తపోటు, షుగర్ వ్యాధులతో బాధపడుతున్నట్టు సమాచారం.