వై కట్టప్ప కిల్డ్ బాహుబలి? ఈ ప్రశ్నకి జవాబు కోసం అభిమానులు దాదాపు రెండు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రశ్న ఏ రేంజ్ కి వెళ్లిందంటే క్వశ్చన్ ఆఫ్ ది ఇయర్ గా కూడా ఇది మారిపోయింది.
అయితే ఇప్పుడు ఆ ప్రశ్నకి కారణమైన కట్టప్ప చేతిలోని కత్తి ఇప్పుడు ఓ ప్రముఖ నిర్మాత చేతికందింది. వివరాల్లోకి వెళితే, ముంబైలో జరిగిన హిందీ ట్రైలర్ రిలీజ్ విడుదల సందర్భంగా, ఈ కత్తిని బాహుబలి టీం కరణ్ జోహార్ కి బహుమతిగా ఇచ్చింది.
కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని హిందీలో పంపిణి చేయడంవల్ల ఈ సినిమాకి ఒక పెద్ద బ్రాండ్ వేల్యూ ఏర్పడింది. దీనికి కృతజ్ఞత గా ఈ బహుమతిని ఇచ్చినట్టు సమాచారం.