ఇవిగో సాక్షాధారాలు.. కిడ్నాప్ డ్రామా క‌ట్టు క‌థేనా?

మరిన్ని వార్తలు

గ‌త నాలుగైదు రోజులుగా క‌రాటే క‌ల్యాణీ పేరు మార్మోగిపోతోంది. ఏ టీవీ ఛాన‌ల్ చూసినా త‌న గురించే. మొన్నామ‌ధ్య యూ ట్యూబ్ స్టార్‌తో న‌డి రోడ్డుపై గొడ‌వ‌కు దిగి.. షాక్ ఇచ్చింది. ఆ త‌ర‌వాత‌.. ఆమె పోలీస్ స్టేష‌న్ ముందూ ఇలాంటి హంగామానే చేసింది. ఆ త‌ర‌వాత కిడ్నాప్ కేసు నెత్తిమీద పెట్టింది. పిల్ల‌ల్ని ద‌త్త‌త పేరుతో తీసుకొని, విక్ర‌యిస్తుంద‌ని ఆమెపై ఫిర్యాదులు అంద‌డంతో, శిశు సంక్షేమ శాఖ అధికారులు క‌ల్యాణి ఇంటిపై దాడి చేశారు. ఆ స‌మ‌యంలో క‌ల్యాణీ లేక‌పోవ‌డం, ఆమె మొబైల్ స్విచ్చాఫ్ లో ఉండ‌డంతో.. క‌ల‌క‌లం రేగింది. ఓ రోజంతా క‌ల్యాణీ అజ్ఞాతంలోనే ఉంది.

 

ఇప్పుడు క‌రాటే క‌ల్యాణీ మీడియా ముందుకొచ్చింది. `నేనేం పారిపోలేదు. పారిపోయేంత పిరికిదాన్ని కాదు` అంటూ సాక్ష్యాధారాలు చూపించేసింది. పాప త‌ల్లిదండ్రుల్ని మీడియా ముందుకు తీసుకొచ్చింది. `మాకు ముగ్గురు ఆడ‌పిల్ల‌లు.... వాళ్ల‌ని పోషించే శ‌క్తి లేకే... క‌ల్యాణీకి ఇచ్చాం. ఆమె ద‌గ్గ‌రైతే మా పాప భ‌విష్య‌త్తు బాగుంటుంది` అని పాప త‌ల్లిదండ్రులు క్లారిటీ ఇచ్చారు. తాను ఎవ‌రినీ ద‌త్త‌త తీసుకోలేద‌ని, వాళ్ల‌ని పెంచుతున్నాన‌ని, త‌న‌పై లేనిపోని అభాండాలు వేస్తున్నార‌ని, వీటి వెనుక కొంత‌మంది రాజ‌కీయ నాయ‌కులు, ఓ సంస్థ ఉంద‌ని, వాళ్ల పేర్లు అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు బ‌య‌ట‌పెడ‌తాన‌ని చెప్పుకొచ్చింది క‌ల్యాణీ. పాప త‌ల్లిదండ్రులే మీడియా ముందుకొచ్చి, క‌ల్యాణీకి స‌పోర్ట్ గా నిల‌బ‌డ్డారు కాబ‌ట్టి.. ఈ కిడ్నాప్ డ్రామా అంతా క‌ట్టు క‌థే అని తేలిపోయింది. ఇక క‌ల్యాణీ నెక్ట్స్ స్టెప్ ఏమిటో?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS