బాహుబలితో లెక్కలన్నీ మార్చేశాడు ప్రభాస్. ముఖ్యంగా తన సినిమా అంటే.. దేశ వ్యాప్తంగా ఉన్న సూపర్ స్టార్లలో ఎవరో ఒకరు ప్రభాస్ సినిమాలో ఉండాల్సిందే. పాన్ ఇండియా ప్రాజెక్టు కాబట్టి, మిగిలిన భాషల్లో ఉన్న నటీనటులూ... తప్పకుండా మెరుస్తున్నారు. ఇటీవల ప్రభాస్ 25వ సినిమాకి సంబంధించిన ప్రకటన వచ్చింది. ఈ చిత్రానికి `స్పిరిట్` అనే పేరు పెట్టారు. సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. ప్రభాస్ తప్ప, మిగిలిన తారాగణం ఎవరన్నది చెప్పలేదు. అయితే ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం కరీనా కపూర్ పేరు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ట్విస్ట్ ఏమిటంటే.. కరీనా ఇందులో విలన్ అట.
`స్పిరిట్`లో చాలామంది విలన్లు కనిపిస్తారని, అందులో ఓ లేడీ విలన్ పాత్రకూ ప్రాధాన్యం ఉందని సమాచారం. ఆ పాత్ర కోసం కరీనా పేరు పరిశీలిస్తున్నార్ట. అయితే ఈ విషయమై కరీనాతో సంప్రదించాల్సివుంది. కరీనా ఇప్పటి వరకూ నెగిటీవ్ రోల్ చేయలేదు. తనకు కచ్చితంగా కొత్తగా ఉంటుంది. ప్రభాస్ సినిమా, అందులోనూ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి.. కాదనడానికి కరీనా దగ్గర కారణాలేం కనిపించవు. ఒకవేళ కథ నచ్చితే.. ఈ సినిమాలో కరీనాని విలన్ గా చూడొచ్చు. 2022 చివర్లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశంఉంది. తెరపై చూడాలంటే 2023 వరకూ ఆగాల్సిందే.