ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా వున్నాడు రామ్‌చరణ్. ఈ సినిమా తర్వాత శంకర్ సినిమా ఉంటుంది. ఇటీవలే సినిమాని అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్తారు. ఐతే ఈ గ్యాప్ లో చరణ్ నుంచి మరో సినిమా ప్రకటన వచ్చింది. చరణ్ హీరోగా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చరణ్ ట్వీట్ చేశారు.
ఈ కాంబినేషన్ కోసం తాను ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. మరోవైపు గౌతమ్ సైతం.. చరణ్ తో కలిసి పనిచేయడం పట్ల ఆనందం వ్యక్తంచేశారు. ‘జెర్సీ’ విడుదలైన సమయంలో గౌతమ్ ని ప్రశంసిస్తూ చరణ్ దంపతులు ఓ లేఖ రాశారు. తాజాగా ఆ లేఖను ట్విటర్‌లో షేర్ చేసిన గౌతమ్.. ‘ఎంతోకాలం నుంచి ఈ లేఖను దాచిపెట్టుకున్నాను.
చరణ్‌తో కలిసి పనిచేసే అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా దాన్ని బయట ప్రపంచానికి చూపించాలనుకున్నాను. ఇంత త్వరగా ఈ అవకాశం నాకు వస్తుందని అనుకోలేదు. లవ్ యూ చరణ్ సర్’ అని ట్వీట్ చేశారు. మొత్తానికి రామ్ చరణ్ లైన్ లో కొత్త సినిమా చేరింది. చరణ్ 2020 డైరీ కూడా ఫుల్ అయిపోయినట్లే.