పెళ్లై, ఓ బిడ్డకి తల్లయినా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్‌లో అందం ఏమాత్రం తగ్గలేదు. సరికదా. అంతకంతకూ పెరిగిపోతోంది.
ఈ ఫోటోలో చూస్తున్నారుగా, కరీనా కపూర్ ఎంతగా హీటు పుట్టిస్తోందో. అందుకే కుర్రకారుకు కరీనా అంటే అంత క్రేజ్. సినిమాల్లో ఇప్పుడు కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ప్రెగ్నెన్సీ సమయంలో కొంచెం బొద్దుగా మారింది. కొడుకు పుట్టిన తర్వాత మళ్లీ ఫిజిక్‌పై దృష్టి పెట్టింది. కసరత్తులు చేసి, జీరో సైజ్‌కి మారింది. హాట్ హాట్ ఫోటోలకు పోజులిచ్చేస్తోంది.
ప్రస్తుతం 'వీర్ ది వెడ్డింగ్' సినిమాలో నటిస్తోంది కరీనా. ఆ సినిమాలోనిదే ఈ స్టిల్. ఈ స్టిల్‌లో కరీనాని చూస్తే, కుర్రకారుకు కంటి మీద కునుకు రావడం కష్టమే కదా. కరీనా రూటే సెపరేటు.. బాలీవుడ్ తెరపై జీరోసైజ్ అంటే దానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన కరీనా, పెళ్ళయ్యాక కూడా గ్లామరస్‌గా సత్తా చాటడమంటే ఆషామాషీ విషయం కాదు కదా.!